టీడీపీలో ఉండి ఏం మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఉంది- శిల్పా
కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీలో అప్పుడే పోరుమొదలైంది. ఇటీవల వైసీపీని వీడి భూమానాగిరెడ్డి టీడీపీలోకి రావడంతో అధిపత్యం మొదలైంది. భూమాకు, శిల్పా సోదరులకు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఈనేపథ్యంలోనే శిల్పా మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, జిల్లా టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు తులసిరెడ్డిపై రాత్రి భూమా వర్గీయులు వేటకొడవళ్లతో దాడి చేశారు. ఆయన చావుబతుకుల మధ్య హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శిల్పామోహన్ రెడ్డి.. చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేశారు. భూమా వచ్చాక పరిస్థితులు […]
కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీలో అప్పుడే పోరుమొదలైంది. ఇటీవల వైసీపీని వీడి భూమానాగిరెడ్డి టీడీపీలోకి రావడంతో అధిపత్యం మొదలైంది. భూమాకు, శిల్పా సోదరులకు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఈనేపథ్యంలోనే శిల్పా మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, జిల్లా టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు తులసిరెడ్డిపై రాత్రి భూమా వర్గీయులు వేటకొడవళ్లతో దాడి చేశారు. ఆయన చావుబతుకుల మధ్య హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శిల్పామోహన్ రెడ్డి.. చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేశారు.
భూమా వచ్చాక పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని వివరించారు. తాను పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నానని అప్పుడు ఎలాంటి గొడవలు లేదని చెప్పారు. భూమా ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయంలో మీడియాతో మాట్లాడిన శిల్పామోహన్ రెడ్డి… తాము టీడీపీలో ఉండి ఏం మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఉందన్నారు. తమను టీడీపీలో లేకుండా చేయాలన్నదే భూమా ఉద్దేశమని…అందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.
అధికారంలో ఉంటూ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడికే రక్షణ లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి దాడులు పునరావృతమైతే తామూ తీవ్రంగానే స్పందించాల్సి ఉంటుందని భూమా వర్గానికి శిల్పా వార్నింగ్ ఇచ్చారు. తాము ఫ్యాక్షన్ ప్రోత్సహించే రకం కాదని..కానీ పరిస్థితులను అటుగా తీసుకెళ్తున్నారని భూమాపై మండిపడ్డారు శిల్పా. మొత్తం మీద భూమా, శిల్పా మధ్య పోరు తారస్థాయికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి.
Click on Image to Read: