అఖిల్ రెండో సినిమా వంశీ పైడిపల్లితో...
ఊపిరి సినిమా విజయం వంశీ పైడిపల్లికి మరో ఆఫర్ తెచ్చిపెట్టింది. అంతా ఊహించినట్టుగానే వంశీ పైడిపల్లికి అఖిల్ రెండో సినిమాను అప్పగించాడు నాగార్జున. ఊపిరి సినిమా హిట్టయితే… కచ్చితంగా వంశీకే అఖిల్ సినిమాను ఇస్తాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. ఇప్పుడు అదే నిజమైంది. ఊపిరి సినిమా తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న వేళ…. వంశీ పైడిపల్లిని పిలిచి మరీ అఖిల్ సినిమా కట్టబెట్టాడు. దీంతో ఇన్నాళ్లూ సస్పెన్స్ గా ఉన్న అఖిల్ […]
Advertisement
ఊపిరి సినిమా విజయం వంశీ పైడిపల్లికి మరో ఆఫర్ తెచ్చిపెట్టింది. అంతా ఊహించినట్టుగానే వంశీ పైడిపల్లికి అఖిల్ రెండో సినిమాను అప్పగించాడు నాగార్జున. ఊపిరి సినిమా హిట్టయితే… కచ్చితంగా వంశీకే అఖిల్ సినిమాను ఇస్తాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. ఇప్పుడు అదే నిజమైంది. ఊపిరి సినిమా తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న వేళ…. వంశీ పైడిపల్లిని పిలిచి మరీ అఖిల్ సినిమా కట్టబెట్టాడు. దీంతో ఇన్నాళ్లూ సస్పెన్స్ గా ఉన్న అఖిల్ రెండో సినిమాపై క్లారిటీ వచ్చేసింది. ఉగాది రోజున ఈ సినిమా ప్రారంభం అవుతుంది. 90 రోజుల్లో సినిమాను పూర్తిచేసి, దసరాకు విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టుడియోస్ తో పాటు… పీవీపీ బ్యానర్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తాడు. ఊపిరి సినిమా ప్రచార కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత…. దేవిశ్రీతో కలిసి వంశీ పైడిపల్లి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభిస్తాడు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఉగాది రోజున ప్రకటిస్తారు.
Advertisement