ఇక చలానాకి చెల్లు...ఫోన్‌లోనే ధృవపత్రాలన్నీ!
రోడ్డుమీద వెళుతున్న వాహనాలను పోలీసులు అపి చలానాలు బాదే కార్యక్రమానికి ఇక కాలం చెల్లిపోనుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నఓ సరికొత్త నిర్ణయంతో ఫోన్‌లోనే డ్రైవింగ్ లైసెన్సుతో పాటు వాహనం తాలూకూ సకల ధృవపత్రాలను భద్రపరచుకునే వీలు కలుగుతుంది. ఏ లైసెన్సులు, అత్యవసర పత్రాలు మర్చిపోయామో అని…ఆందోళన చెందాల్సిన పనిలేదు. జేబులో ఫోను ఉంటే చాలు, వాహనం తాలూకూ అన్ని పత్రాలు అరచేతిలో డిజిటల్ రూపంలో ఇమిడిపోతాయి. ఇందుకోసం ప్రభుత్వం ఆర్‌టిఎ ఎం- వ్యాలెట్ అనే పేరుతో మొబైల్ […]
రోడ్డుమీద వెళుతున్న వాహనాలను పోలీసులు అపి చలానాలు బాదే కార్యక్రమానికి ఇక కాలం చెల్లిపోనుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నఓ సరికొత్త నిర్ణయంతో ఫోన్‌లోనే డ్రైవింగ్ లైసెన్సుతో పాటు వాహనం తాలూకూ సకల ధృవపత్రాలను భద్రపరచుకునే వీలు కలుగుతుంది. ఏ లైసెన్సులు, అత్యవసర పత్రాలు మర్చిపోయామో అని…ఆందోళన చెందాల్సిన పనిలేదు. జేబులో ఫోను ఉంటే చాలు, వాహనం తాలూకూ అన్ని పత్రాలు అరచేతిలో డిజిటల్ రూపంలో ఇమిడిపోతాయి. ఇందుకోసం ప్రభుత్వం ఆర్‌టిఎ ఎం- వ్యాలెట్ అనే పేరుతో మొబైల్ యాప్‌ని రూపొందించింది. ఇందులో డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం(ఆర్సీ), కాలుష్య నియంత్రణ తనిఖీపత్రం, వాహన బీమా, వాహన పర్మిట్లు ఇలా అన్నింటినీ భద్రపరచుకోవచ్చు. ఈ యాప్‌ని ఫోన్లోని ప్లేస్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పించారు. ఒక వ్యక్తి తనకు సంబంధించిన ఎన్ని ధృవపత్రాలనైనా ఈ యాప్‌లో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఆండ్రాయడ్, ఐఓఎస్ ఫోనుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
యాప్‌ని డౌన్ లోడ్ చేసుకున్న అనంతరం, ధృవపత్రాలపై ఉన్న పేరుని ఫోన్లో నమోదు చేయాలి. దాంతో వన్ టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. దాన్ని నమోదు చేసిన వెంటనే ఆ పత్రం తాలూకూ కాపీ డిజిటల్ రూపంలో ఫోన్‌లో కనబడుతుంది. డిజిటల్ విధానంలో ఫోన్లో ఉన్న ధృవపత్రాలను ఆమోదించాలని ప్రభుత్వం రవాణా, పోలీసు తదితర విభాగాల ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. శనివారంనుండి అందుబాటులోకి రానున్న ఈ యాప్‌తో నకిలీ పత్రాలకు చెక్ పెట్టవచ్చని అధికారులు ఆశిస్తున్నారు.