క్లాస్ దర్శకుడితో సునీల్ మూవీ

సునీల్ ఇప్పటివరకు మాస్ సినిమాలు, కామెడీ టచ్ ఉన్న మూవీస్ మాత్రమే చేశాడు. క్లాస్ గా ఉండే సినిమాలు చేయలేదు. మిస్టర్ పెళ్లికొడుకు సినిమాలో సాఫ్ట్ గా కనిపించినప్పటికీ దాన్ని క్లాస్ మూవీగా చెప్పలేం. వరుసగా సినిమాలు ఫెయిలవుతుండడంతో ఈసారి క్లాస్ గా ఉండే కథకు సునీల్ ఓకే చెప్పాడు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఓనమాలు లాంటి సినిమాలు తెరకెక్కించిన క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. సింహ, షాడో లాంటి […]

Advertisement
Update:2016-03-24 10:58 IST
సునీల్ ఇప్పటివరకు మాస్ సినిమాలు, కామెడీ టచ్ ఉన్న మూవీస్ మాత్రమే చేశాడు. క్లాస్ గా ఉండే సినిమాలు చేయలేదు. మిస్టర్ పెళ్లికొడుకు సినిమాలో సాఫ్ట్ గా కనిపించినప్పటికీ దాన్ని క్లాస్ మూవీగా చెప్పలేం. వరుసగా సినిమాలు ఫెయిలవుతుండడంతో ఈసారి క్లాస్ గా ఉండే కథకు సునీల్ ఓకే చెప్పాడు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఓనమాలు లాంటి సినిమాలు తెరకెక్కించిన క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. సింహ, షాడో లాంటి సినిమాలు నిర్మించిన పరుచూరి ప్రసాద్… సునీల్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం సునీల్ జక్కన్న అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు 80శాతం కంప్లీట్ అయిపోయింది. మిగిలిన 20శాతం కంప్లీట్ అయిన వెంటనే…. క్రాంతిమాధవ్ మూవీని పట్టాలపైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు సునీల్. కామెడీ, మాస్ చిత్రాలు పోయి.. క్లాస్ బాట పట్టిన సునీల్ కు కనీసం ఆ యాంగిల్ లో అయినా సక్సెస్ రావాలని కోరుకుందాం.
Tags:    
Advertisement

Similar News