చంద్రబాబుపై వ్యాజ్యం కొట్టివేత

దళితులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట లభించింది. చంద్రబాబుపై దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. కేవలం ప్రచారం కోసమే వ్యాజ్యం వేసినట్టుగా ఉందని న్యాయమూర్తి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. పత్రికల కథనాల ఆధారంగా పిటిషన్ ఎలా వేస్తారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు పేదరికం గురించి వివరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందరూ  డబ్బున్న వారిగా పుట్టాలనుకుంటారని, రాజులుగా పుట్టి రాజ్యమేలాలనుకుంటారని, ఎస్సీలుగా పుట్టాలని ఎవరు […]

Advertisement
Update:2016-03-23 04:06 IST

దళితులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట లభించింది. చంద్రబాబుపై దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. కేవలం ప్రచారం కోసమే వ్యాజ్యం వేసినట్టుగా ఉందని న్యాయమూర్తి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. పత్రికల కథనాల ఆధారంగా పిటిషన్ ఎలా వేస్తారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు పేదరికం గురించి వివరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందరూ డబ్బున్న వారిగా పుట్టాలనుకుంటారని, రాజులుగా పుట్టి రాజ్యమేలాలనుకుంటారని, ఎస్సీలుగా పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై అప్పట్లో దుమారం రేగింది. చంద్రబాబు దళితులను కించపరిచారంటూ విమర్శలు వచ్చాయి.

చంద్రబాబుపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని పలువురు డిమాండ్ చేశారు. ఎస్సీఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు అడుసుమిల్లి ప్రతాప్ కుమార్ నేరుగా హైకోర్టులో వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. చంద్రబాబుపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. అయితే పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ దానిని కొట్టివేశారు. చంద్రబాబుకు మరోసారి కోర్టులో సానుకూల తీర్పు రావడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

అయితే చంద్రబాబు ఎస్సీలుగా పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారు అని అనడం పత్రికలలో మాత్రమే రాలేదు. చానల్స్ లో కూడా వచ్చింది. ఆయన అలా అన్న విడియో టేప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. పత్రికా కథనాలు, వీడియోలు కూడా సాక్ష్యాధారాలుగా పనికిరాకపోతే ఇక ఏమి చూపించి కోర్టులలో ఫ్రూవ్ చేయాలో ప్రజలకు అర్థంకాని పరిస్థితి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News