"ఊపిరి" తీస్తుందా లేక పోస్తుందా ?
తెలుగు నాట సమాంతర చిత్రాలకు ఆదరణ లేదు. నిజాలు , వాస్తవాలు సినిమా కథల రూపంలో చెబితే మన ఆడియన్స్ కు పెద్దగా నచ్చదు. వాళ్లు అందుకోలేని జీవితాన్ని రంగు రంగులుగా చూపించాలి. అందమైన డ్రీమ్స్ ని అమ్మాలి. అయితే తమిళ నాట మాత్రం పరిస్థితి మరికొంత భిన్నం. అక్కడ రియలిస్టిక్ చిత్రాల్ని చూస్తారు. కమర్షియల్ చిత్రాల్నీ ఆదరిస్తారు. కేవలం కమర్షియల్ చిత్రాలకే బ్రహ్మరథం పట్టడం అనే పద్దతి లేదు. మరి ఇటువంటి పిరిస్థితిలో ఊపిరి చిత్రాన్ని […]
తెలుగు నాట సమాంతర చిత్రాలకు ఆదరణ లేదు. నిజాలు , వాస్తవాలు సినిమా కథల రూపంలో చెబితే మన ఆడియన్స్ కు పెద్దగా నచ్చదు. వాళ్లు అందుకోలేని జీవితాన్ని రంగు రంగులుగా చూపించాలి. అందమైన డ్రీమ్స్ ని అమ్మాలి. అయితే తమిళ నాట మాత్రం పరిస్థితి మరికొంత భిన్నం. అక్కడ రియలిస్టిక్ చిత్రాల్ని చూస్తారు. కమర్షియల్ చిత్రాల్నీ ఆదరిస్తారు. కేవలం కమర్షియల్ చిత్రాలకే బ్రహ్మరథం పట్టడం అనే పద్దతి లేదు. మరి ఇటువంటి పిరిస్థితిలో ఊపిరి చిత్రాన్ని 65 కోట్లు పెట్టి పీవిపి సంస్థ నిర్మించడం గొప్ప సాహాసమనే చెప్పాలి.
ఎందుకంటే నాగార్జున కు తెలుగు నాట మన్మథడని.. సొగ్గాడనే ఇమేజ్ ఉంది. ఈ మధ్యనే సొగ్గాడే చిన్నినాయనా చిత్రం తో బాక్సాఫీస్ ను కొల్ల గొట్టాడు. వెంటనే వీల్ చైర్ కు పరి మితమైన రోల్ తో ఆడియన్స్ ముందకు వస్తున్నాడు. కేవలం కళ్లు.. చేతులతో యాక్షన్ చేసి మెప్పించాలి. ఈ విధంగా కేవలం కుర్చికే పరిమితం కావడం అనేది తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు జీర్ణించుకుంటారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. తమిళ నాట నాగార్జునకు ఏ విధమైన ఇమేజ్ లేదు కాబట్టి కార్తీ , తమన్నా లు అక్కడ హిట్ జోడిగా ఇమేజ్ ఉంది. కోలీవుడ్ ప్రేక్షకులు మంచి చిత్రాల్ని ఆదరిస్తాడు. అలా చూస్తే కొంత వరకు కోలీవుడ్ ఆడియన్స్ ను ఈ చిత్రం మెప్పించ వచ్చు కానీ.. తెలుగు ఆడియన్స్ ను మాత్రం నాగార్జున విషయంలో ఇది అడ్వెంచర్ అనే చెప్పాలి. మొత్తం మీద ఊపిరి సినిమా ఈ నెల 25 న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. రిజల్ట్ రెండు చోట్ల ఒకే విధంగా వస్తుందా..లేదా అనేది సందిగ్ధమే.
Click on image to read