వారిని సాక్షి వెంటాడుతోందా?

సాక్షి పత్రిక ఎవరెన్ని చెప్పినా అది జగన్‌కు అనుకూల పత్రికే. ఈ విషయంలో ఎవరికీ అనుమానం లేదు. అయితే బలమైన మీడియా సంస్థ అయినప్పటికీ సాక్షి మీడియా జగన్‌కు అనుకున్న విధంగా ఉపయోగపడడంలేదన్న భావన ఉండేది. అయితే ఇటీవల అందుకు భిన్నంగా సాక్షి దూకుడు పెంచినట్టుగా ఉంది.  జగన్‌ను పనికట్టుకుని తిట్టే టీడీపీ నేతలను వెంటాడుతోంది.  తమకు సంబంధం లేకపోయినా చంద్రబాబు మెప్పుకోసం జగన్‌ మీదకు ఒంటికాలితో కొందరు టీడీపీనేతలు లేచేవారు. అయితే సాక్షి ఇటీవల అనుసరిస్తున్న […]

Advertisement
Update:2016-03-21 03:59 IST

సాక్షి పత్రిక ఎవరెన్ని చెప్పినా అది జగన్‌కు అనుకూల పత్రికే. ఈ విషయంలో ఎవరికీ అనుమానం లేదు. అయితే బలమైన మీడియా సంస్థ అయినప్పటికీ సాక్షి మీడియా జగన్‌కు అనుకున్న విధంగా ఉపయోగపడడంలేదన్న భావన ఉండేది. అయితే ఇటీవల అందుకు భిన్నంగా సాక్షి దూకుడు పెంచినట్టుగా ఉంది. జగన్‌ను పనికట్టుకుని తిట్టే టీడీపీ నేతలను వెంటాడుతోంది. తమకు సంబంధం లేకపోయినా చంద్రబాబు మెప్పుకోసం జగన్‌ మీదకు ఒంటికాలితో కొందరు టీడీపీనేతలు లేచేవారు. అయితే సాక్షి ఇటీవల అనుసరిస్తున్న వైఖరితో చాలా మంది టీడీపీ నేతలు అనవసరంగా జగన్‌ను తిట్టడం ఎందుకన్న భావనకు వచ్చేశారని తెలుస్తోంది. కొందరు మాత్రం ఇంకా ఆ ధోరణి వీడడం లేదు. దీంతో వారు చేస్తున్న తప్పులను పదేపదే సాక్షి ఎత్తిచూపుతోందని అంటున్నారు. అచ్చెన్నాయుడు, రావెల కిషోర్‌ బాబు, దేవినేని ఉమ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి లాంటివారు ఆ లిస్ట్‌లో ఉన్నారు.

మంత్రి రావెల కిషోర్‌బాబు కొడుకు మహిళపై దాడి చేయడం, రాజధానిలో అసైన్డ్ భూములు కొనడం వంటివాటితో పాటు తాజాగా నియోజకవర్గంలో మంత్రి పోకడల వల్ల కిందిస్థాయి నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నట్టుగా సాక్షి కథనం రాసింది. గుంటూరు రూరల్ మండలంలోని లాల్‌పురంలో రూ. 2కోట్లతో నిర్మించిన సబ్‌ స్టేషన్ మంత్రి వైఖరి వల్లే ప్రారంభోత్సవం కావడం లేదని స్థానికులు చెబుతుంటారు. ఈ విషయాన్ని సాక్షి ప్రముఖంగా ప్రచురించింది. విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవానికి ఎంపీపీ తోట లక్ష్మి కుమారిని పిలవ వద్దంటూ మంత్రి అధికారులను ఆదేశించారని దీని వల్లే పరిస్థితి జఠిలమై సబ్ స్టేషన్‌ ప్రారంభోత్సవం ఆగిపోయిందట. కొన్ని నెలల క్రితం మంత్రికి వ్యతిరేకంగా టీడీపీ ఎంపీపీ అయిన తోట లక్ష్మి కుమారి దీక్ష కూడా చేశారు.

ఇక శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు చేస్తున్న దౌర్జన్యాలను కూడా సాక్షి పత్రిక వరుసగా ప్రచురిస్తోంది. భూములు ఆక్రమించుకోవడం, అధికారులను బెదిరించడం వంటి సంఘటనలను ప్రముఖంగా వెలుగులోకి తెస్తోంది. దేవినేని ఉమ శాఖలో జరుగుతున్న అవినీతిని కూడా ఎండగడుతూనే ఉంది. మొన్నటి వరకు సాధు జంతువులా ఉన్న సాక్షి ఇప్పుడు ఇలా వెంటాడడం మొదలుపెట్టే సరికి చాలా మంది టీడీపీ నేతలు ప్రెస్‌మీట్లకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. అవసరంగా వైసీపీని తిడితే తమ బాగోతాలు కూడా సాక్షి పత్రిక ప్రచురిస్తుందన్న భయం వారిలో నెలకొందని చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News