ప్రభాస్ పాటతో నాగచైతన్య సినిమా

ప్రభాస్ నటించిన సూపర్ హిట్ సినిమా మిర్చిలో “ఇదేదో బాగుందే చెలి” అంటూ ఓ పాట ఉంది. ప్రభాస్-అనుష్క మధ్య వచ్చే సాంగ్ అది. ఇప్పుడిదే టైటిల్ లో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. వీర, రైడ్, అబ్బాయితో అమ్మాయి లాంటి ఫ్లాప్ సినిమాలు చేసిన రమేష్ వర్మ…. ఈ టైటిల్ తో నాగచైతన్యకు ఓ రొమాంటిక్ స్టోరీ చెప్పాడట. చైతూ కూడా స్టోరీని ఇష్టపడినట్టు చెబుతున్నారు. అయితే సినిమా చేసే విషయంపై మాత్రం చైతూ ఇంకా […]

Advertisement
Update:2016-03-19 02:42 IST

ప్రభాస్ నటించిన సూపర్ హిట్ సినిమా మిర్చిలో “ఇదేదో బాగుందే చెలి” అంటూ ఓ పాట ఉంది. ప్రభాస్-అనుష్క మధ్య వచ్చే సాంగ్ అది. ఇప్పుడిదే టైటిల్ లో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. వీర, రైడ్, అబ్బాయితో అమ్మాయి లాంటి ఫ్లాప్ సినిమాలు చేసిన రమేష్ వర్మ…. ఈ టైటిల్ తో నాగచైతన్యకు ఓ రొమాంటిక్ స్టోరీ చెప్పాడట. చైతూ కూడా స్టోరీని ఇష్టపడినట్టు చెబుతున్నారు. అయితే సినిమా చేసే విషయంపై మాత్రం చైతూ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే…. ప్రస్తుతం నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో, ప్రేమమ్ సినిమాలు చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అయిన వెంటనే కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాను స్టార్ట్ చేస్తాడు. దాంతో పాటు మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమా సిద్ధంగా ఉంది. సో… ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత నాగచైతన్య నెక్ట్స్ మూవీపై ఓ క్లారిటీ వస్తుంది. అప్పటివరకు రమేష్ వర్మ వెయిట్ చేయక తప్పదు. నాగార్జునతో శిరిడి సాయి సినిమా తీసిన మహేష్ రెడ్డి…. ఈ కొత్త సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News