రాజకీయాల్లోకి మళ్లీ వస్తున్నా… సినీ పరిశ్రమలో విలువలు లేవు

తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో తాను త్వరలోనే క్రీయాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్టు నటుడు మోహన్‌బాబు చెప్పారు. గతంలో రాజకీయంగా కొంతమందికి సపోర్ట్ చేశానని… త్వరలోనే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. ఏ పార్టీ అనేది మాత్రం ఇప్పుడు చెప్పలేనన్నారు. రాజకీయాల్లోకి వచ్చే సమయంలోనే ఏపార్టీలో చేరేది చెబుతానన్నారు. రాజకీయాల్లోకి వస్తానంటూనే ప్రస్తుత రాజకీయ పార్టీల తీరుపై మోహన్‌బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పేపర్ తీస్తే ఒకరిమీద ఒకరు బురద చల్లుకున్న వార్తలే […]

Advertisement
Update:2016-03-19 05:07 IST

తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో తాను త్వరలోనే క్రీయాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్టు నటుడు మోహన్‌బాబు చెప్పారు. గతంలో రాజకీయంగా కొంతమందికి సపోర్ట్ చేశానని… త్వరలోనే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. ఏ పార్టీ అనేది మాత్రం ఇప్పుడు చెప్పలేనన్నారు. రాజకీయాల్లోకి వచ్చే సమయంలోనే ఏపార్టీలో చేరేది చెబుతానన్నారు. రాజకీయాల్లోకి వస్తానంటూనే ప్రస్తుత రాజకీయ పార్టీల తీరుపై మోహన్‌బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పేపర్ తీస్తే ఒకరిమీద ఒకరు బురద చల్లుకున్న వార్తలే ఉంటున్నాయన్నారు. అడవిలో జంతులు ఆహారం కోసం కలహపడుతాయని అది ప్రకృతి ధర్మం అన్నారు. కానీ మనుషులు ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. మనుషులు కలహించుకోవడం ప్రకృతి ధర్మం కాదన్నారు. రోజురోజుకూ రాజకీయాలు దిగజారిపోతున్నాయన్నారు. స్వార్థం మరీ ఎక్కువైపోయిందన్నారు. సినీ పరిశ్రమలోనూ విలువలు లేవన్నారు. చిన్ననిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కులవేదికల్లో పక్కకులాలను తిట్టుకుంటున్నారని మోహన్‌ బాబు అన్నారు.

రాజకీయాలు దిగజారిపోయాయి. పార్టీల తీరు బాగోలేదంటూనే క్రీయాశీలరాజకీయాల్లోకి వస్తానని మోహన్‌బాబు చెప్పడం ఆసక్తికరంగానే ఉంది. దిగజారిపోయిన రాజకీయాలను బాగుచేసేందుకు ప్రయత్నిస్తున్న పార్టీలలో చేరుతారో లేక పాత పార్టీల్లోనే ఒదిగిపోతారో చూడాలి. మోహన్‌బాబు ఇది వరకు టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీగానూ పనిచేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News