కేంద్రం పాచిక పార‌లేదు... ఇక‌ కేజ్రీవాల్ కి ప్ర‌క‌ట‌న‌ల పండగే పండగ‌!

సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు రాజ‌కీయ‌నాయ‌కులంద‌రికీ నెత్తిన పాలుపోసేదే అయినా అది కేజ్రీవాల్‌కి మ‌రింత ఆనందాన్ని క‌లిగించే విష‌యంగా చెప్ప‌వచ్చు. ప్ర‌భుత్వాలు ఇచ్చే అధికారిక ప్ర‌క‌ట‌న‌ల్లో ముఖ్య‌మంత్రులు, మంత్రులు, గ‌వ‌ర్న‌ర్ల ఫొటోలు ఉండ‌వ‌చ్చ‌ని సుప్రీంకోర్టు త‌న తీర్పులో పేర్కొంది. గ‌త ఏడాది కోర్టు,  ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ఇచ్చుకుంటున్నఅధికారిక‌ ప్ర‌క‌ట‌న‌ల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు, గ‌వ‌ర్న‌ర్లు క‌నిపించాల్సిన అవ‌స‌రం లేద‌ని, ప్ర‌జాస్వామ్య విధానానికి అది విరుద్ద‌మ‌ని, అలా చేయ‌డం వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ని పెంచుకోవ‌డం అవుతుంద‌ని ఒక జ‌డ్జిమెంట్‌లో పేర్కొంది. ఈ […]

Advertisement
Update:2016-03-18 16:30 IST

సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు రాజ‌కీయ‌నాయ‌కులంద‌రికీ నెత్తిన పాలుపోసేదే అయినా అది కేజ్రీవాల్‌కి మ‌రింత ఆనందాన్ని క‌లిగించే విష‌యంగా చెప్ప‌వచ్చు. ప్ర‌భుత్వాలు ఇచ్చే అధికారిక ప్ర‌క‌ట‌న‌ల్లో ముఖ్య‌మంత్రులు, మంత్రులు, గ‌వ‌ర్న‌ర్ల ఫొటోలు ఉండ‌వ‌చ్చ‌ని సుప్రీంకోర్టు త‌న తీర్పులో పేర్కొంది. గ‌త ఏడాది కోర్టు, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ఇచ్చుకుంటున్నఅధికారిక‌ ప్ర‌క‌ట‌న‌ల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు, గ‌వ‌ర్న‌ర్లు క‌నిపించాల్సిన అవ‌స‌రం లేద‌ని, ప్ర‌జాస్వామ్య విధానానికి అది విరుద్ద‌మ‌ని, అలా చేయ‌డం వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ని పెంచుకోవ‌డం అవుతుంద‌ని ఒక జ‌డ్జిమెంట్‌లో పేర్కొంది.

ఈ తీర్పుని మ‌రొక‌సారి స‌మీక్షించాల్సిందిగా కోరుతూ ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు, కేంద్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుని ఆశ్ర‌యించాయి. దాంతో దీనిపై తిరిగి విచార‌ణ జ‌రిపిన కోర్టు, ప్ర‌భుత్వాల‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అంతేకాదు, వచ్చే నెల‌లోఅసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల్లో కూడా ఈ తీర్పు అమ‌ల‌వుతుంద‌ని ప్ర‌క‌టించింది. అయితే కేంద్రం త‌న పిటీష‌న్లో రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇచ్చే ప్ర‌క‌ట‌న‌ల్లో రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఇది స‌మాఖ్య రాజ్యాంగ స్ఫూర్తికి వ్య‌తిరేక‌మ‌ని వాదించినా కోర్టు ఆ వాద‌న‌ను ప‌ట్టించుకోలేదు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కూడా నేతల ఫొటోలు ప్ర‌క‌ట‌న‌ల్లో క‌నిపించే అవ‌కాశం క‌ల్పించింది. దాంతో రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ప్ర‌క‌ట‌న‌ల్లో క‌నిపించ కుండా చేయాల‌నే కేంద్రం ఆశ నెర‌వేర‌లేదు.

ఈ నేప‌థ్యంలో ఇప్పటివరకు కేజ్రీవాల్ ను బద్దశత్రువుగా భావిస్తున్న మీడియా ఆయనకు సంబంధించిన అన్ని వార్తలను ఆయనకు వ్యతిరేకంగా ఎంత దారుణంగా వండివార్చినా ప్రజలకు నిజాలు చెప్పుకునే అవకాశం ఈ ప్రకటనల ద్వారా కేజ్రీవాల్ కు సాధ్యమౌతుంది. ఢిల్లీ ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాల‌ను ప్ర‌క‌ట‌న‌ల రూపంలో ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళుతున్న ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌, ఇక త‌న ప్రభుత్వ విజయాల ప్ర‌క‌ట‌న‌లు రూపొందించుకునే ప‌నిలో బిజీగా ఉంటార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో కామెంట్లు విన‌బ‌డుతున్నాయి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News