ఆ చెత్త‌డ‌బ్బా... న‌న్ను ఖాళీ చేయండోచ్ అని చెబుతుంది!

డిజిట‌ల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌చ్ఛ‌భార‌త్ అభియాన్‌ని కూడా దానికి అనుసంధానం చేయ‌నుంది. ఈ క్ర‌మంలో సూర్య‌శ‌క్తితో ప‌నిచేసే చెత్త డ‌బ్బాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఇవి నిండిపోగానే ఆ స‌మాచారం పారిశుధ్య‌ సిబ్బందికి ఆన్‌లైన్ ద్వారా  చేరుతుంది. ఇప్ప‌టికే వీటిని అమెరికాలో వినియోగిస్తున్నారు. సూర్య‌శ‌క్తిని, ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీని క‌లిపి వీటిని రూపొందించారు. బిగ్ బెల్లీ అనే కంపెనీ అమెరికా, మ‌రో 47 దేశాల‌కు ఈ సోలార్ ప‌వ‌రున్న చెత్త డ‌బ్బాల‌ను స‌ప్ల‌యి చేస్తోంది. బిగ్‌బెల్లీ రూపొందించిన […]

Advertisement
Update:2016-03-18 06:35 IST

డిజిట‌ల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌చ్ఛ‌భార‌త్ అభియాన్‌ని కూడా దానికి అనుసంధానం చేయ‌నుంది. ఈ క్ర‌మంలో సూర్య‌శ‌క్తితో ప‌నిచేసే చెత్త డ‌బ్బాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఇవి నిండిపోగానే ఆ స‌మాచారం పారిశుధ్య‌ సిబ్బందికి ఆన్‌లైన్ ద్వారా చేరుతుంది. ఇప్ప‌టికే వీటిని అమెరికాలో వినియోగిస్తున్నారు. సూర్య‌శ‌క్తిని, ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీని క‌లిపి వీటిని రూపొందించారు. బిగ్ బెల్లీ అనే కంపెనీ అమెరికా, మ‌రో 47 దేశాల‌కు ఈ సోలార్ ప‌వ‌రున్న చెత్త డ‌బ్బాల‌ను స‌ప్ల‌యి చేస్తోంది. బిగ్‌బెల్లీ రూపొందించిన ఈ ట్రాష్ క్యాన్లు పూర్తిగా క‌వ‌ర్ చేసి ఉంటాయి. అలాగే ఇవి నిండ‌గానే, సోలార్ ప‌వ‌ర్‌ని వినియోగించుకుని ఆన్‌లైన్ విధానంలో స‌మాచారాన్ని అందించ‌గ‌లుగుతాయి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News