రోబో 2.0  ఆడియో ఇండియాలో ఉండ‌దు..!

ద‌క్షిణాది మోస్ట్ ప్రామిసింగ్ డైరెక్ట‌ర్  శంక‌ర్. ర‌జ‌నీకాంత్,  అక్ష‌య్ కుమార్,    లీడ్ రోల్స్ లో   చేస్తున్న రోబో సీక్వెల్ పై  యావత్ ఇండియా ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తుంది.   శంక‌ర్ త‌న పూర్వ వైభావాన్ని తిరిగి పుచ్చుకోవ‌డానికి   ఎంతో  క‌సిగా  వ‌ర్కవుట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఒక కొత్త రూమ‌ర్  కోలీవుడ్లో  బాగా   హల్ చ‌ల్ చేస్తుంది.  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో వేడుకను ఘనంగా లండన్ లో నిర్వహించాలని దర్శక […]

Advertisement
Update:2016-03-18 11:26 IST

ద‌క్షిణాది మోస్ట్ ప్రామిసింగ్ డైరెక్ట‌ర్ శంక‌ర్. ర‌జ‌నీకాంత్, అక్ష‌య్ కుమార్, లీడ్ రోల్స్ లో చేస్తున్న రోబో సీక్వెల్ పై యావత్ ఇండియా ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తుంది. శంక‌ర్ త‌న పూర్వ వైభావాన్ని తిరిగి పుచ్చుకోవ‌డానికి ఎంతో క‌సిగా వ‌ర్కవుట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఒక కొత్త రూమ‌ర్ కోలీవుడ్లో బాగా హల్ చ‌ల్ చేస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో వేడుకను ఘనంగా లండన్ లో నిర్వహించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ హెడ్ ఆఫీస్ లండన్ లోనే ఉంది. అందుకే అన్నింటికీ అనుకూలంగా ఉంటుందని అక్కడ నిర్వహించాలనే ప్లాన్ లో ఉన్నారట నిర్మాత.

కానీ ఎప్పుడూ అభిమానులకు పెద్ద పీఠ వేసే రజనీ తన అభిమానులకు దూరంగా ఎక్కడో లండన్ లో ఆడియో కార్యక్రమాన్ని చేయడానికి ఒప్పుకుంటారా లేదా అనేదే తేలాల్సిన విషయం.?? ఇకపోతే ఈ సినిమాకి ఏ. ఆర్ . రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా రజనీ సరసన యామీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం 2017 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    
Advertisement

Similar News