క్షణం కోసం కిక్కిచ్చే ఫార్ములా
ఓ చిన్న సినిమా. టాక్ కూడా పాజిటివ్ గా వచ్చింది. అలాంటి మూవీని భారీ విజయంగా మార్చాలంటే ఏం చేయాలి. ప్రచారాన్ని ఊదరగొట్టాలి. క్షణం సినిమా విషయంలో నిర్మాత పీవీపీ అదే చేశాడు. పాజిటివ్ టాక్ తో ప్రారంభమైన ఈ సినిమాకు ప్రచారాన్ని యాడ్ చేశాడు. ఫలితంగా రెవెన్యూ పరంగా సినిమాను బ్లాక్ బస్టర్ గా మార్చేశాడు. ఈ విషయంలో పీవీపీ ఫార్ములాను లెక్కల్లో చూస్తే అతడి స్కెచ్ ఏంటో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సినిమా నిర్మాణానికి […]
Advertisement
ఓ చిన్న సినిమా. టాక్ కూడా పాజిటివ్ గా వచ్చింది. అలాంటి మూవీని భారీ విజయంగా మార్చాలంటే ఏం చేయాలి. ప్రచారాన్ని ఊదరగొట్టాలి. క్షణం సినిమా విషయంలో నిర్మాత పీవీపీ అదే చేశాడు. పాజిటివ్ టాక్ తో ప్రారంభమైన ఈ సినిమాకు ప్రచారాన్ని యాడ్ చేశాడు. ఫలితంగా రెవెన్యూ పరంగా సినిమాను బ్లాక్ బస్టర్ గా మార్చేశాడు. ఈ విషయంలో పీవీపీ ఫార్ములాను లెక్కల్లో చూస్తే అతడి స్కెచ్ ఏంటో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సినిమా నిర్మాణానికి కేవలం కోటి 10లక్షల రూపాయలు మాత్రమే ఖర్చుపెట్టాడు పీవీపీ. అదే సినిమా ప్రచారానికి మాత్రం ఏకంగా కోటి 40లక్షల రూపాయలు ఖర్చుపెట్టాడు. ప్రచారానికి సోషల్ మీడియా నుంచి ప్రింట్ మీడియా వరకు దేన్నీ వదల్లేదు. ఫలితంగా క్షణం సినిమాకు 5కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే…. ప్రచారంతో కలిపి రెండున్న కోట్లు ఖర్చుపెడితే… లాభం రెండున్నర కోట్లు వచ్చాయన్నమాట. స్టార్ ఎట్రాక్షన్ లేని ఏ సినిమాకు అయినా పాటించాల్సిన ఫార్ములా ఇదే.
Advertisement