తెలంగాణ అసెంబ్లీలో రోజా ప్రస్తావన
తెలంగాణ అసెంబ్లీలో రోజా ఏడాది సస్పెన్షన్ వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. డిప్యూటీ స్పీకర్ ను ఉద్దేశించి కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ చేసిన వ్యాఖ్యలపై సభలో దుమారం రేగిన సమయంలో ఈ ప్రస్తావన వచ్చింది. సంస్కారం లేని వారు సభను నడుపుతున్నారని డీకే అరుణ .. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారంటూ అధికారపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. డీకే అరుణ వ్యాఖ్యలపై పద్మా దేవేందర్ రెడ్డి కంటతడి పెట్టారు. వెంటనే చైర్‌కు డీకే […]
తెలంగాణ అసెంబ్లీలో రోజా ఏడాది సస్పెన్షన్ వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. డిప్యూటీ స్పీకర్ ను ఉద్దేశించి కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ చేసిన వ్యాఖ్యలపై సభలో దుమారం రేగిన సమయంలో ఈ ప్రస్తావన వచ్చింది. సంస్కారం లేని వారు సభను నడుపుతున్నారని డీకే అరుణ .. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారంటూ అధికారపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. డీకే అరుణ వ్యాఖ్యలపై పద్మా దేవేందర్ రెడ్డి కంటతడి పెట్టారు.
వెంటనే చైర్‌కు డీకే అరుణ క్షమాపణ చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న జానారెడ్డి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. పట్టింపులు వదిలిపెట్టి సభను హుందాగా నడిపేందుకు అందరూ పనిచేయాలని సూచించారు. అయితే జానారెడ్డి వ్యాఖ్యలతో అధికారపక్షం శాంతించలేదు.
ఈ సమయంలోనే హరీష్ రావు ఏపీ అసెంబ్లీలో రోజా సస్పెన్షన్ అంశాన్ని గుర్తు చేశారు. ”పక్క సభలో ఒక సభ్యురాలు ఆఫ్ ది రికార్డులో కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఏకంగా ఏడాది పాటు సస్పెండ్ చేశారు. కానీ మేం అలా చేయం. కాబట్టి తాము కేవలం డీకే అరుణ నుంచి క్షమాపణ మాత్రమే కోరుతున్నాం” అని అన్నారు. తాను చైర్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని డీకే అరుణ చెప్పారు. దీంతో వ్యవహారాన్ని వారివారి సభ్యతకు, విజ్ఞతకే వదిలేస్తున్నానని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి చెప్పారు. జానారెడ్డిలాంటి పెద్దవారి సమక్షంలో ఇంత అవమానం జరుగుంటే ఏం చేయగలమని డిప్యూటీ స్పీకర్ ప్రశ్నించారు. అధికారపక్షం కూడా ఈ విషయాన్ని ఇక వివాదం చేయవద్దని పద్మా దేవేందర్ రెడ్డి కోరారు. దీంతో వివాదానికి తెరపడింది.
Click on Image to Read: