అనుష్క శ‌ర్మ అస‌లైన వ‌స్తాదులా మారిపోయింది!

సినీతార‌లు త‌మ పాత్ర‌ల్లో  జీవించ‌డం మామూలే. ఇక్క‌డ అనుష్క‌శ‌ర్మ కూడా అదే చేస్తోంది. సుల్తాన్ సినిమాకోసం ఆమె మ‌ల్ల‌యుద్ధ యోధురాలిగా న‌టిస్తోంది. స‌ల్మాన్‌ఖాన్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో రెజ్లింగ్‌లో ఆరితేరిన యువ‌తిగా క‌నిపించేందుకు ఆమె ఆరువారాల‌పాటు శిక్ష‌ణ కూడా తీసుకుంది. ఈ సినిమా ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫ‌ర్ మాటల్లో చెప్పాలంటే అనుష్క మ‌ల్ల‌యుద్ధంలో నిపుణురాలేమో అనిపిస్తోంది. అలీ అబ్బాస్‌, అనుష్క రెజ్లింగ్ ప్ర‌తిభ‌ని వెల్లడిస్తున్న ఫొటోని ట్విట్ట‌ర్లో షేర్‌ చేశాడు, హ‌ర్యానా కి […]

Advertisement
Update:2016-03-13 10:12 IST

సినీతార‌లు త‌మ పాత్ర‌ల్లో జీవించ‌డం మామూలే. ఇక్క‌డ అనుష్క‌శ‌ర్మ కూడా అదే చేస్తోంది. సుల్తాన్ సినిమాకోసం ఆమె మ‌ల్ల‌యుద్ధ యోధురాలిగా న‌టిస్తోంది. స‌ల్మాన్‌ఖాన్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో రెజ్లింగ్‌లో ఆరితేరిన యువ‌తిగా క‌నిపించేందుకు ఆమె ఆరువారాల‌పాటు శిక్ష‌ణ కూడా తీసుకుంది. ఈ సినిమా ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫ‌ర్ మాటల్లో చెప్పాలంటే అనుష్క మ‌ల్ల‌యుద్ధంలో నిపుణురాలేమో అనిపిస్తోంది. అలీ అబ్బాస్‌, అనుష్క రెజ్లింగ్ ప్ర‌తిభ‌ని వెల్లడిస్తున్న ఫొటోని ట్విట్ట‌ర్లో షేర్‌ చేశాడు, హ‌ర్యానా కి షేర్ని అనే క్యాప్ష‌న్ కూడా ఇచ్చాడు. ఇందుకు బ‌దులు చెబుతూ అనుష్క‌, రెండునెల‌ల క్రితం తాను ఇలా చేయ‌గ‌ల‌ద‌నే ఊహ కూడా లేద‌ని, ఇదంతా తన‌కు ల‌భించిన అదృష్ట‌మ‌ని అంటూ మురిసిపోయింది. ఒక మ‌ల్ల‌యుద్ధ యోధుని నిజ‌జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం స‌ల్మాన్ కూడా తీవ్రమైన కృషి చేస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News