దసరా నుంచే బాహుబలి సంబరం

వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయాలనుకుంటున్న బాహుబలి-2 సినిమాకు సంబంధించి…. ప్రచారాన్ని ఈ ఏడాది దసరా నుంచే ప్రారంభించాలని రాజమౌళి నిర్ణయించాడట. కనీసం 6 నెలల ముందు నుంచే ప్రచారం ప్రారంభించాలని ఇప్పటికే ఫిక్స్ అయిన రాజమౌళి… అందుకు దసరా అయితే బాగుంటుందని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్ట్-1 కోసం ఎలాగైతే కామిక్ కాన్సెప్ట్ ను ఎన్నుకున్నాడో… ఈసారి కూడా పార్ట్-2 కోసం అలాంటి డిఫరెంట్ కామిక్ కాన్సెప్ట్ నే ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. దసరా నుంచి దశల […]

Advertisement
Update:2016-03-09 07:37 IST
వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయాలనుకుంటున్న బాహుబలి-2 సినిమాకు సంబంధించి…. ప్రచారాన్ని ఈ ఏడాది దసరా నుంచే ప్రారంభించాలని రాజమౌళి నిర్ణయించాడట. కనీసం 6 నెలల ముందు నుంచే ప్రచారం ప్రారంభించాలని ఇప్పటికే ఫిక్స్ అయిన రాజమౌళి… అందుకు దసరా అయితే బాగుంటుందని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్ట్-1 కోసం ఎలాగైతే కామిక్ కాన్సెప్ట్ ను ఎన్నుకున్నాడో… ఈసారి కూడా పార్ట్-2 కోసం అలాంటి డిఫరెంట్ కామిక్ కాన్సెప్ట్ నే ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. దసరా నుంచి దశల వారీగా టీజర్లు విడుదల చేసి…. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో ప్రచారంలోకి దిగాలని బాహుబలి టీం భావిస్తోంది. ప్రస్తుతం బాహుబలి షూటింగ్ 50శాతం కంప్లీట్ అయింది. మిగిలిన 50శాతం షూటింగ్ ను ఈ ఏడాది చివరి నాటికి పూర్తిచేసి…. వచ్చే ఏడాది జనవరి నుంచి యూనిట్ అంతా ప్రమోషన్ లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పార్ట్-1తో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన జక్కన్న… పార్ట్-2తో ఈసారి మరిన్ని రికార్డులపై కన్నేశాడు.
Tags:    
Advertisement

Similar News