రైతుని కాబోయి...నటుడినయ్యా!
పవన్ కల్యాణ్ ఒక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన సమాధానాలతో తన మనోభావాలు వెల్లడించారు. ఇంకా వీడియో విడుదల కానీ ఆ ఇంటర్వ్యూలో పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలివి- నేను రైతుని కాబోయి అనుకోకుండా నటుడిని అయ్యాను. సినిమాల్లో ఎన్నో గొప్పమాటలు చెబుతుంటాం….వాటిని నిజజీవితంలో పాటించలేకపోవడం బాధని కలిగిస్తుంది. వాస్తవ జీవితంలో కూడా నా గొంతుని వినిపించాలనే రాజకీయాల్లోకి వచ్చాను. సినిమాలే జీవితం కాదు, జీవితం సినిమా కన్నా పెద్దది. వ్యక్తీకరణ అనేది నాకు చాలా ముఖ్యం. అన్నింటికంటే […]
Advertisement
పవన్ కల్యాణ్ ఒక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన సమాధానాలతో తన మనోభావాలు వెల్లడించారు. ఇంకా వీడియో విడుదల కానీ ఆ ఇంటర్వ్యూలో పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలివి-
- నేను రైతుని కాబోయి అనుకోకుండా నటుడిని అయ్యాను.
- సినిమాల్లో ఎన్నో గొప్పమాటలు చెబుతుంటాం….వాటిని నిజజీవితంలో పాటించలేకపోవడం బాధని కలిగిస్తుంది.
- వాస్తవ జీవితంలో కూడా నా గొంతుని వినిపించాలనే రాజకీయాల్లోకి వచ్చాను.
- సినిమాలే జీవితం కాదు, జీవితం సినిమా కన్నా పెద్దది.
- వ్యక్తీకరణ అనేది నాకు చాలా ముఖ్యం. అన్నింటికంటే ముఖ్యమైనది. నన్ను నేను నిజాయితీగా ఉంచుకోవాలనుకుంటున్నాను.
- నిజజీవితంలో మనందరిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. కానీ నేను చెడ్డవాడిగా నటించలేను. నేను అంతమంచి నటుడిని అనుకోవడం లేదు.
- భారతీయ సినిమా తీయడం చాలా కష్టం. అన్నీ సమపాళ్లలో ఉండాలనుకుంటాం. ఇది చాలా కష్టం.
- షూటింగ్‌లు లేకపోతే నేను గడ్డం పెరిగిపోయేలా విపరీతంగా చదువుతాను.
- ఇప్పటినుండి సినిమాల మీద మరింతగా ఫోకస్ పెడతాను. నా జీవితానికి ఒక స్థిరత్వం కావాలంటే సినిమాలు చేయాలి. కొన్ని సంవత్సరాల తరువాత సినిమాలు వదిలేస్తాను.
- ఒకసారి రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వస్తే సినిమాలు వదిలేస్తా. నేను నా అంతరాత్మని వినడం మానలేను.
- నటన వదిలేసినా రాస్తుంటాను. రాయడం నాకు చాలా ఇష్టమైన విషయం.
- పనిచేసి అక్కడి నుండి నిష్క్రమించడం అనేది నా పద్ధతి. అంతకుమించి వేరే విషయాలను గురించి నేను ఆలోచించను.
Click on Image to Read:
Advertisement