గుడ్ ఈవినింగ్ చెబుతున్న నయనతార

నయనతార అస్సలు తెలుగువైపు చూడ్డమే మానేసింది. ఇక ఆమె నుంచి పలకరింపులు ఆశించడం అత్యాశే అవుతుంది. చివరికి వెంకీకి కూడా కాల్షీట్లు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతోంది. అలాంటి ముద్దుగుమ్మ ఏకంగా టాలీవుడ్ కు గుడ్ ఈవెనింగ్ చెబుతోంది. అవును… నయన నయా మూవీ పేరే ఈ గుడ్ ఈవెనింగ్. తమిళనాట అప్పుడెప్పుడో ఉదయ్ నిధి స్టాలిన్ తో కలిసి ఓ సినిమా చేసింది నయనతార. ఆ మూవీనే ఇప్పుడు తెలుగులో గుడ్ ఈవెనింగ్ పేరుతో విడుదల చేయడానికి […]

Advertisement
Update:2016-03-04 06:07 IST
నయనతార అస్సలు తెలుగువైపు చూడ్డమే మానేసింది. ఇక ఆమె నుంచి పలకరింపులు ఆశించడం అత్యాశే అవుతుంది. చివరికి వెంకీకి కూడా కాల్షీట్లు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతోంది. అలాంటి ముద్దుగుమ్మ ఏకంగా టాలీవుడ్ కు గుడ్ ఈవెనింగ్ చెబుతోంది. అవును… నయన నయా మూవీ పేరే ఈ గుడ్ ఈవెనింగ్. తమిళనాట అప్పుడెప్పుడో ఉదయ్ నిధి స్టాలిన్ తో కలిసి ఓ సినిమా చేసింది నయనతార. ఆ మూవీనే ఇప్పుడు తెలుగులో గుడ్ ఈవెనింగ్ పేరుతో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు అవుతున్నాయి. ఇదైపోగానే… సినిమాకు ప్రత్యేకంగా ప్రమోషన్ కల్పించి అప్పుడు తెరపైకి తీసుకొస్తారట. అన్నట్టు ఈ సినిమా ప్రచారానికి నయన్ వస్తుందనే ప్రచారం సాగుతోంది. సినిమాకు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడే తెలుగు డబ్బింగ్ కు కూడా ఒక రోజు ప్రచారం చేసిపెట్టాలనే షరతుపై భారీ మొత్తం సమర్పించుకొని ఆమెను తీసుకున్నారట. మరి ఇదే కనుక నిజమైతే… నయనతార నిజంగానే తెలుగు ప్రేక్షకులకు గుడ్ ఈవెనింగ్ చెబుతుంది.
Tags:    
Advertisement

Similar News