లోనికి రాకుండా గట్టిగా తలుపులు మూశారట!

టీడీపీ నేతలు సాధారణంగా ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులను తీవ్ర స్థాయిలో విమర్శించరు. రాజకీయంగా విమర్శించాల్సి వచ్చినా సుతిమెత్తగా విమర్శిస్తుంటారు. కానీ పురందేశ్వరి విషయంలో మాత్రం కథ మరోలా ఉంది. టీడీపీ నేతలు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి  కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడానికి, పోలవరానికి అనుకున్న స్థాయిలో నిధులు రాకపోవడానికి ఏపీ ప్రభుత్వ వైఖరే కారణమని పురందేశ్వరి విమర్శించారు. అలా ఆమె ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించగానే టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. […]

Advertisement
Update:2016-03-01 19:01 IST

టీడీపీ నేతలు సాధారణంగా ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులను తీవ్ర స్థాయిలో విమర్శించరు. రాజకీయంగా విమర్శించాల్సి వచ్చినా సుతిమెత్తగా విమర్శిస్తుంటారు. కానీ పురందేశ్వరి విషయంలో మాత్రం కథ మరోలా ఉంది. టీడీపీ నేతలు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడానికి, పోలవరానికి అనుకున్న స్థాయిలో నిధులు రాకపోవడానికి ఏపీ ప్రభుత్వ వైఖరే కారణమని పురందేశ్వరి విమర్శించారు. అలా ఆమె ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించగానే టీడీపీ నేతలు రంగంలోకి దిగారు.

గోరంట్ల బుచ్చయ్యచౌదరితో పాటు వర్ల రామయ్య కూడా పురందేశ్వరిపై ఒంటి కాలితో లేచారు. కొత్త బిచ్చగత్తె, అవాకులు చెవాకులు పేలుతున్నారు వంటి ఘాటైన పదాలతో ఆమెను విమర్శించారు. బీజేపీలో పురందేశ్వరి కొత్త బిచ్చగత్తెలా తయారైందని బుచ్చయ్యచౌదరి విమర్శించారు. పురందేశ్వరికి కనీసం ఇంకితజ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. పోలవరం అంచనా వ్యయం 30 వేల కోట్లకు పైగా ఎందుకు పెరిగిందో తెలియదా అని ప్రశ్నించారు. కేంద్రంతో పోరాడడం చేతగాక తమపై నిందలు వేస్తారా అని బుచ్చయ్యచౌదరి …పురందేశ్వరిపై విరుచుకుపడ్డారు.

ఒక అడుగు ముందుకేసిన వర్ల రామయ్య గతాన్ని కూడా గుర్తు చేస్తూ విమర్శలు చేశారు. కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రిగా చేసిన పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలడం మానుకోవాలని సూచించారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన పురందేశ్వరి మొన్నటి ఎన్నికల సమయంలో తిరిగి టీడీపీలోకి దూరేందుకు ప్రయత్నించారని విమర్శించారు. కానీ తాము తలుపులు తెరవలేదన్నారు. ప్రవేశం లేదని గట్టిగా తలుపులు మూసేసరికి బీజేపీకి వెళ్లారని వర్ల రామయ్య చెప్పారు. ఇప్పుడు బీజేపీలో తన ఉనికి చాటుకునేందుకు, బీజేపీ అగ్రనేతల దృష్టిలో పడేందుకు ఆమె అవాకులు చెవాకులు పేలుతున్నారని వర్ల రామయ్య విమర్శించారు. మోదీ, చంద్రబాబు మధ్య స్నేహాన్ని చెడగొట్టేందుకు పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పురందేశ్వరి బీజేపీలో ఉన్న కాంగ్రెస్ కోవర్ట్ అని ఆరోపించారు.

బడ్జెట్లో ఏపీకి జరిగిన కేటాయింపులపై పలువురు చేస్తున్న విమర్శలకు పురందేశ్వరి సమాధానం చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే టీడీపీ నేతలు మెరుపు వేగంతో ఆమెపై ఈ రేంజ్‌లో విరుచుకుపడడం చర్చనీయాంశమైంది. అంతేకాదు ఎన్నికల సమయంలో పలువురు కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు మరి పురందేశ్వరి విషయంలో మాత్రం ప్రవేశం లేదంటూ తలుపులు గట్టిగా ఎందుకు బిగించారో!.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News