క్ష‌ణం బాలీవుడ్ కు !

అడ‌విశేషు, అదాశ‌ర్మ‌.. అన‌సూయ లీడ్ రోల్స్ లో కొత్త ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ చేసిన క్ష‌ణం చిత్రం విడుద‌లైన అన్ని చోట్ల మంచి క‌లెక్ష‌న్స్ రాబడుతుంది. ఓవ‌ర్సీస్ లో కూడా క‌లెక్ష‌న్స్ బాగానే వస్తున్నాయట. కోటి రూపాయ‌ల వ్యయం తో చేసిన క్ష‌ణం చిత్రం .. పెట్టుబ‌డికి నాలుగు .. ఐదు రెట్లు ఎక్కువుగా రాబ‌ట్టే అవకాశం వుందంటున్నారు. దీంతో బాలీవుడ్ నిర్మాత‌లు కొంద‌రు క్ష‌ణం చిత్రం రీమేక్ రైట్స్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే సినిమా సూప‌ర్ హిట్ టాక్ […]

Advertisement
Update:2016-03-02 04:44 IST

అడ‌విశేషు, అదాశ‌ర్మ‌.. అన‌సూయ లీడ్ రోల్స్ లో కొత్త ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ చేసిన క్ష‌ణం చిత్రం విడుద‌లైన అన్ని చోట్ల మంచి క‌లెక్ష‌న్స్ రాబడుతుంది. ఓవ‌ర్సీస్ లో కూడా క‌లెక్ష‌న్స్ బాగానే వస్తున్నాయట. కోటి రూపాయ‌ల వ్యయం తో చేసిన క్ష‌ణం చిత్రం .. పెట్టుబ‌డికి నాలుగు .. ఐదు రెట్లు ఎక్కువుగా రాబ‌ట్టే అవకాశం వుందంటున్నారు.

దీంతో బాలీవుడ్ నిర్మాత‌లు కొంద‌రు క్ష‌ణం చిత్రం రీమేక్ రైట్స్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే సినిమా సూప‌ర్ హిట్ టాక్ గెయిన్ చేయ‌డంతో పీవీపీ సంస్థ తామే స్వయంగా బాలీవుడ్ లో రీమేక్ చేయాలని భావిస్తుందట‌. మరోసారి రవికాంత్ దర్శకత్వంలో, అడవి శేష్ హీరోగా క్షణం సినిమాను బాలీవుడ్ లో రూపొందించే ఆలోచనలో పీవిపీ సంస్థ ఉన్న‌ట్లు ఫిల్మ్ న‌గ‌ర్ టాక్. స‌స్పెన్స్ , థ్రిల్ల‌ర్ చిత్రానికి ఉండాల్సిన ప‌క‌డ్బంధీ స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి ఒక‌ పెద్ద ఎస్సెట్ .

Tags:    
Advertisement

Similar News