టెక్నికల్ గా అదరగొట్టిన మ్యాడ్ మ్యాక్స్- ఫ్యూరి రోడ్
సినిమా అంటే దృశ్య మాధ్యమం. పాయింట్ స్ట్రయిట్ గాం ఉంటే అసలు లాంగ్వేజ్ తో సంబంధం ఉండదు. ఇలా ఎన్నో చిత్రాలు అభిమానుల మనసు గెలిచాయి . కట్ చే్స్తే మొన్న అస్కార్ అవార్డుల రేసు లో దాదాపు 6 విభాగాల్లో అవార్డులు పొందిన మ్యాడ్ మ్యాక్స్ చిత్రం చూస్తుంటే యాక్షన్ చిత్రాలు ఇష్టపడే సినిమా లవర్స్ చెవులు కోసుకుంటారు. సినిమాటోగ్రఫి.. యాక్షన్ సీక్వెన్స్.. టైట్ స్క్రీన్ ప్లే.. అద్భుతమైన సాంగ్ మిక్సింగ్.. కాస్టూమ్స్.. వాట్ […]
Advertisement
సినిమా అంటే దృశ్య మాధ్యమం. పాయింట్ స్ట్రయిట్ గాం ఉంటే అసలు లాంగ్వేజ్ తో సంబంధం ఉండదు. ఇలా ఎన్నో చిత్రాలు అభిమానుల మనసు గెలిచాయి . కట్ చే్స్తే మొన్న అస్కార్ అవార్డుల రేసు లో దాదాపు 6 విభాగాల్లో అవార్డులు పొందిన మ్యాడ్ మ్యాక్స్ చిత్రం చూస్తుంటే యాక్షన్ చిత్రాలు ఇష్టపడే సినిమా లవర్స్ చెవులు కోసుకుంటారు. సినిమాటోగ్రఫి.. యాక్షన్ సీక్వెన్స్.. టైట్ స్క్రీన్ ప్లే.. అద్భుతమైన సాంగ్ మిక్సింగ్.. కాస్టూమ్స్.. వాట్ నాట్ ప్రతి విషయం మనల్ని కట్టి పడేస్తుంది. టామ్ హార్డి, చార్జిజ్ ప్రధాన పాత్రధారులుగా జార్జ్ మిల్లర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఒక వండర్ ఫుల్ ఫిల్మ్.
కథ పరంగా చెప్పుకుంటే.. నరరూప రాక్షసులాంటి క్రూరులు నీరు, ఇంధనం తదితర వనరులను గుప్పిట్లో పెట్టుకుని.. ప్రజలను బందీలుగా చేసి పీడిస్తుంటారు. వారి చెరలో చిక్కుకున్న కథా నాయకుడు వారి నుంచి తప్పించుకుని ప్రజలను ఎలా రక్షించాడన్నది కథాంశం.
Advertisement