కోహ్లీ మ‌ర‌చిపోలేక పోతున్నాడా..!

ప్రేమ క‌థ‌లు.. ప్రేమ బంధాలు.. విరహ గాధలు.. మ‌ర‌చిపోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. డాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మల ప్రేమ బంధం తెలిసిందే.

Advertisement
Update:2016-02-29 08:54 IST

ప్రేమ క‌థ‌లు.. ప్రేమ బంధాలు.. విరహ గాధలు.. మ‌ర‌చిపోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. డాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మల ప్రేమ బంధం తెలిసిందే. ఇద్ద‌రు క‌ల‌సి ఒక యాడ్ షూటింగ్ లో పాల్గొనడం.. ఇద్ద‌రి మ‌ధ్య అప్ప‌టి నుంచి ప్రేమ .. కొంత కాలం ప్ర‌పంచంతో మాకు సంబంధం లేదు అన్నంత‌గా తిర‌గ‌డం.. ఆ త‌రువాత‌.. నాకు నేనే..నీకు నీవే అని విడిపోవ‌డం అంతా ఇక సాంగ్ లా జ‌రిగిపోయింది. క‌ట్ చేస్తే ప్ర‌స్తుతం అనేక సిరిస్ ల‌తో కోహ్లీ ఫుల్ బిజీగా వున్నాడు.

అయితే ఈ మ‌ధ్య విరాట్ త‌న‌కు బాగా ఇష్ట‌మైన ఒక సాంగ్ ను ఆల‌పించాడ‌ట‌. తన ఫేవరెట్ బాలీవుడ్ పాట 'జో వాదా కియా వో నిభానా పడేగా'. 'తాజ్ మహాల్' సినిమా కోసం లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ పాడిన ఈ పాటను అప్పుడప్పుడు హామ్ చేస్తూ ఉంటాడు. ఇటీవల బంగ్లాదేశ్ లోని భారత హైకమిషన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కోహ్లి మైక్ అందుకొని ఈ పాట పాడాడు. పాట పాడుతున్న‌ప్పుడు యువ‌రాజ్ సింగ్ షూట్ చేశాడ‌ట‌. దానిని ఇప్పుడు విరాట్ కోహ్లీ త‌న ఇన్ స్టా గ్రామ్ లో అప్ లోడ్ చేశాడు. మ‌రి ఈ వీడియో ను అప్ లోడ్ చేయ‌డం వెన‌క ఈ స్ట్రోక్ ప్లేయిర్ ఆలోచ‌న .. ఆవేద‌న ఏదైనా ఉందా అనే కోణంలో గాసిప్ రాయుళ్లు ఎవ‌రికి తోచిన‌ట్లు వాళ్లు రాసేస్తున్నారు మ‌రి.



Tags:    
Advertisement

Similar News