ఎర్ర చందనానికి… కళా వందనం!
ఎర్రచందనం…అత్యంత విలువైన గంధపు చెక్కలు. సువాసనా భరితమైన, ఔషధ నిలయమైన ఈ వృక్షాల చుట్టూ ఇప్పుడు స్మగ్లింగ్ నేరాలు, హత్యలు, అరెస్టులు, ఎన్‌కౌంటర్లు, దాడులు, ప్రతిదాడులు, ప్రభుత్వాల మధ్య వివాదాలు… ఇవన్నీ కమ్ముకుని ఉన్న సంగతి తెలిసిందే. వీటిని కాపాడటం అటవీశాఖ అధికారులకు, ఎర్ర చందనం రక్షణ బలగాలకు పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఎర్ర చందనాన్ని రక్షించుకోవడంపై ఒక లఘుచిత్రాన్ని రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్గింగ్ టాస్క్‌ఫోర్సు నిర్మిస్తోంది. ఈ చిత్ర నిర్మాణంలో తెలుగు […]
ఎర్రచందనం…అత్యంత విలువైన గంధపు చెక్కలు. సువాసనా భరితమైన, ఔషధ నిలయమైన ఈ వృక్షాల చుట్టూ ఇప్పుడు స్మగ్లింగ్ నేరాలు, హత్యలు, అరెస్టులు, ఎన్‌కౌంటర్లు, దాడులు, ప్రతిదాడులు, ప్రభుత్వాల మధ్య వివాదాలు… ఇవన్నీ కమ్ముకుని ఉన్న సంగతి తెలిసిందే. వీటిని కాపాడటం అటవీశాఖ అధికారులకు, ఎర్ర చందనం రక్షణ బలగాలకు పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఎర్ర చందనాన్ని రక్షించుకోవడంపై ఒక లఘుచిత్రాన్ని రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్గింగ్ టాస్క్‌ఫోర్సు నిర్మిస్తోంది.
ఈ చిత్ర నిర్మాణంలో తెలుగు సినిమా, టివి రంగాలకు చెందిన యాభై మంది కళాకారులు పాల్గొంటున్నారు. ఈ షూటింగ్ నిమిత్తం కళాకారుల బృందమొకటి మంగళవారం శేషాచల కొండల్లోని తలకోన అడువులకు వెళ్లింది. ఎర్రచందనమా… నీకు వందనం…పేరుతో ఈ షార్ట్ సినిమా తీస్తున్నారు. ఇందులో సినిమా, టివి నటి శివపార్వతి వనదేవతగా నటిస్తున్నారు. దీక్షిత్ దర్శకత్వం వహిస్తున్నారు.
చిత్ర ప్రారంభానికి, తిరుపతి వైల్డ్‌లైఫ్ సర్కిల్‌లో చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ పివి చలపతి రావు క్లాప్ కొట్టగా, టాస్క్‌ఫోర్స్ డిఐజి ఎమ్ కాంతారావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. యాభైమంది కళాకారులు ఈ చిత్రంలో భిన్నపాత్రల్లో నటించనున్నారని కాంతారావు తెలిపారు. ఎర్రచందనం రక్షణ పైనే ఈ చిత్ర కథ ఉంటుందని ఆయన అన్నారు.