టాలీవుడ్ కు దూరంగా సిద్దు

ఒక‌ప్పుడు హీరో సిద్దార్దను త‌మిళ‌నాడ‌కు చెందిన అబ్బాయి అంటే న‌మ్మే వాళ్లు కాదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. బొమ్మ‌రిల్లు..చిత్రాల‌తో ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ తో టాలీవుడ్ లో చాల స్ట్రాంగ్ గా ఎస్టాబ్లీష్ అయ్యాడు. అయితే ఈ రెండు చిత్రాలు ఇచ్చిన స‌క్సెస్ తో మ‌నోడు చాల చిత్రాలు చేశాడు. ఎంత‌గా అంటే.. ల‌వ‌ర్ బోయ్ గా సిద్దార్ద్ ను చూడ‌లేన్నంత‌గా ఫెయిల్యూర్స్ ను మూట క‌ట్టుకున్నాడు. క‌ట్ చేస్తే.. త‌న చిత్రాలు ఫెయిల్ అయిన‌ప్పుడు..మీడియా మీద హీరో […]

Advertisement
Update:2016-02-24 02:24 IST

ఒక‌ప్పుడు హీరో సిద్దార్దను త‌మిళ‌నాడ‌కు చెందిన అబ్బాయి అంటే న‌మ్మే వాళ్లు కాదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. బొమ్మ‌రిల్లు..చిత్రాల‌తో ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ తో టాలీవుడ్ లో చాల స్ట్రాంగ్ గా ఎస్టాబ్లీష్ అయ్యాడు. అయితే ఈ రెండు చిత్రాలు ఇచ్చిన స‌క్సెస్ తో మ‌నోడు చాల చిత్రాలు చేశాడు. ఎంత‌గా అంటే.. ల‌వ‌ర్ బోయ్ గా సిద్దార్ద్ ను చూడ‌లేన్నంత‌గా ఫెయిల్యూర్స్ ను మూట క‌ట్టుకున్నాడు.

క‌ట్ చేస్తే.. త‌న చిత్రాలు ఫెయిల్ అయిన‌ప్పుడు..మీడియా మీద హీరో సిద్దార్ద ఎన్నో సార్లు.. నోరు జారాడు. ఇక తెలుగు నాట త‌నకు కెరీర్ లేద‌ని భావించి .. త‌న సొంత ప్లేస్ మ‌ద్రాసుకు జంప్ అయ్యాడు. అక్క‌డ కొన్ని చిత్రాలు చేశాడు. న‌టుడిగా ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ రాకుండా.. ఆల్ రౌండ‌ర్ అనిపించుకునే ప్ర‌య‌త్నాలు చేశాడు. అలా ఒక‌టి రెండు .. హిట్స్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా జిల్ జుంగ్.జుంక్ పేరు తో ఒక చిత్రం చేశాడు. ఇది కోలీవుడ్ లో వైవిధ్య‌మైన చిత్రంగా పేరు పొందింది. ఆ మ‌ధ్య వ‌చ్చిన క‌ళావ‌తి చిత్రం లో సిద్దు వున్న విష‌య‌మే ఆడియ‌న్స్ కు పెద్ద‌గా రీచ్ కాలేదు. హ‌న్సిక‌, త్రిష ల‌కే ఆ క్రెడిట్ అంతా పోయింది.

మొత్తం మీద త‌ను కోలీవుడ్ కు వెళ్లి చేసిన చిత్రాలు కొన్ని తెలుగులో డ‌బ్బింగ్ చిత్రాలుగా చేశారు. అవి ఇక్క‌డ ఆడ‌క పోయో స‌రికి ..హీరో సిద్దు..ఏకంగా తెలుగు ఆడియ‌న్స్ కు టేస్ట్ లేద‌ని వ్యాఖ్యానించాడు. దీంతో మ‌నోడిని పూర్తిగా మ‌రిచిపోయారు. కెరీర్ లో స‌క్సెస్..ఫెయిల్యూర్స్ కామ‌న్..కానీ.. నోటి దూల‌తో ఆడియ‌న్స్ లో నెగిటివ్ క్రియోట్ చేసుకుంటే చాల క‌ష్టం క‌దా.

Tags:    
Advertisement

Similar News