మాస్ట‌ర్ ప్లాన్‌పై టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఫైర్

ఏపీ రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్‌పై టీడీపీ ఎంపీలు, ప్రజాప్ర‌తినిధులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. మాస్ట‌ర్ ప్లాన్‌పై కృష్ణా జిల్లా నేత‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు  సీఆర్డీఏ అధికారులు  ఏర్పాటుచేసిన స‌మావేశంలో  పార్టీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుల‌ను మీ చావు మీరు చావండి అన్న‌ట్టుగా మాస్ట‌ర్ ప్లాన్ ఉంద‌ని ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ మండిప‌డ్డారు. ఒక‌ప్పుడు కోటి రూపాయ‌లు ప‌లికిన ఎకరం భూమి అగ్రిజోన్ కార‌ణంగా ప‌ది ల‌క్ష‌లు కూడా ప‌ల‌క‌డం లేద‌ని అన్నారు. మాస్ట‌ర్ […]

Advertisement
Update:2016-02-20 10:17 IST

ఏపీ రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్‌పై టీడీపీ ఎంపీలు, ప్రజాప్ర‌తినిధులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. మాస్ట‌ర్ ప్లాన్‌పై కృష్ణా జిల్లా నేత‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సీఆర్డీఏ అధికారులు ఏర్పాటుచేసిన స‌మావేశంలో పార్టీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుల‌ను మీ చావు మీరు చావండి అన్న‌ట్టుగా మాస్ట‌ర్ ప్లాన్ ఉంద‌ని ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ మండిప‌డ్డారు. ఒక‌ప్పుడు కోటి రూపాయ‌లు ప‌లికిన ఎకరం భూమి అగ్రిజోన్ కార‌ణంగా ప‌ది ల‌క్ష‌లు కూడా ప‌ల‌క‌డం లేద‌ని అన్నారు. మాస్ట‌ర్ ప్లాన్ దెబ్బ‌కు త‌మ ప‌ని అయిపోయింద‌న్నారు. ఎక్క‌డికి వెళ్లినా రైతులు తిడుతున్నార‌ని ఎంపీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చావుకెళ్లినా, పెళ్లిళ్ల‌కు వెళ్లినా మాస్ట‌ర్ ప్లాన్ పైనే రైతులు చ‌ర్చించుకుంటున్నార‌ని ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ అన్నారు.

అగ్రిక‌ల్చ‌ర్ జోన్ పేరుతో కృష్ణా జిల్లాను బ‌లి చేశార‌ని ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్ వ్యాఖ్యానించారు. అయితే అగ్రిజోన్ పై జ‌నం నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చేస‌రికి టీడీపీ నేత‌లు ఇలా అడ్డం తిరిగార‌ని వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. మాస్టర్ ప్లాన్ పై అధికారుల వద్ద కాకుండా ముఖ్యమంత్రి దగ్గర పోరాడితే బాగుంటుందంటున్నారు.

Click on Image to Read

Tags:    
Advertisement

Similar News