కేశ‌వ్ కోపం బాబుపైనా? లేక బాల‌య్య‌పైనా?

ఎవ‌రైనా ప‌ద‌వులొస్తే రెట్టింపు ఉత్సాహంతో పార్టీ త‌ర‌పున ప‌నిచేస్తారు. కానీ టీడీపీలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా త‌యారైంది. సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఓడిపోయి ఎమ్మెల్సీల కోసం పోటీ ప‌డిన నేత‌లు… ఆ ప‌ద‌వులు ద‌క్కే వ‌ర‌కు ప్ర‌భుత్వం త‌ర‌పున ప్ర‌తిప‌క్షంపై ఒంటికాలితో లేచారు. తీరా ఎమ్మెల్సీ ప‌ద‌వులు ద‌క్కిన త‌ర్వాత స‌ద‌రు నేత‌లు త‌న టంగ్‌కు ప‌నిచెప్ప‌డం త‌గ్గించేశారు. ఏదో అప్పుడ‌ప్పుడు సాంప్రదాయం కోసం ఒక ప్రెస్‌మీట్ పెట్టి వైసీపీని తిట్టి వెళ్ల‌డం త‌ప్పితే అంత‌కు మించి ఏమీ […]

Advertisement
Update:2016-02-19 03:59 IST

ఎవ‌రైనా ప‌ద‌వులొస్తే రెట్టింపు ఉత్సాహంతో పార్టీ త‌ర‌పున ప‌నిచేస్తారు. కానీ టీడీపీలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా త‌యారైంది. సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఓడిపోయి ఎమ్మెల్సీల కోసం పోటీ ప‌డిన నేత‌లు… ఆ ప‌ద‌వులు ద‌క్కే వ‌ర‌కు ప్ర‌భుత్వం త‌ర‌పున ప్ర‌తిప‌క్షంపై ఒంటికాలితో లేచారు. తీరా ఎమ్మెల్సీ ప‌ద‌వులు ద‌క్కిన త‌ర్వాత స‌ద‌రు నేత‌లు త‌న టంగ్‌కు ప‌నిచెప్ప‌డం త‌గ్గించేశారు. ఏదో అప్పుడ‌ప్పుడు సాంప్రదాయం కోసం ఒక ప్రెస్‌మీట్ పెట్టి వైసీపీని తిట్టి వెళ్ల‌డం త‌ప్పితే అంత‌కు మించి ఏమీ చేయ‌డం లేదు. ఇలాంటి వారిలో ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశ‌వ్ పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. కేశ‌వ్ చాలా కాలంగా పెద్ద‌గా యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయ‌ని చెబుతున్నారు.

2014 ఎన్నిక‌ల్లో గెలిచి ఉంటే ప‌య్యావుల‌కు మంత్రి పదవి ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఆయ‌న ఓడిపోయారు. దీంతో చాన్స్ ప‌య్యావుల కేశ‌వ్ సామాజిక‌వ‌ర్గానికే చెందిన ప‌రిటాల సునీత‌కు ద‌క్కింది. ఎమ్మెల్సీ ప‌దవి ద్వారా మంత్రివ‌ర్గంలోకి అడుగుపెట్టాల‌ని కేశవ్ భావించారు. ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కిందే గానీ మంత్రి అవ్వాల‌న్న క‌ల నిజ‌మ‌య్యే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. జిల్లా నేత‌ల వ‌ల్లే త‌మ నేత‌కు ఈ పరిస్థితి వ‌చ్చింద‌ని కేశ‌వ్ వ‌ర్గీయులు భావిస్తున్నారు. కేశ‌వ్‌కు మంత్రిప‌ద‌వి రావ‌డం హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు ఇష్టం లేద‌ని చెబుతున్నారు.

నోరున్న నేత కావ‌డం, దూసుకెళ్లే స్వ‌భావం ఉండ‌డంతో కేశ‌వ్ మంత్రి అయితే జిల్లాలో త‌న‌కు ప్రాధాన్య‌త త‌గ్గిపోతుంద‌ని బాల‌య్య భావిస్తున్నార‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రోటోకాల్‌లోనూ కేశ‌వ్‌కు అగ్ర‌తాంబూలం ఇవ్వాల్సి వ‌స్తుంది. అదే స‌మ‌యంలో కేశ‌వ్‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తే అనంత‌పురం జిల్లా నుంచి క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన‌ట్టు అవుతుంది. కేశ‌వ్‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కితే సామాజిక కోణంలో సునీత ప‌ద‌వికి చిక్కులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంది.

ప‌రిటాల సునీత‌కు బాల‌య్య అండ గ‌ట్టిగా ఉంద‌ని భావిస్తున్నారు. అటు చంద్ర‌బాబు తీరుపైనా కేశ‌వ్ వ‌ర్గీయులు గుర్రుగా ఉన్నారు. కేశ‌వ్‌లాంటి నేత‌ను వాడుకోక‌పోవ‌డం వ‌ల్లే అసెంబ్లీలో బ‌య‌ట టీడీపీకి జ‌రుగుతున్న న‌ష్టాన్ని చంద్ర‌బాబు అంచ‌నా వేసుకోవాల‌ని కోరుతున్నారు. ఒక వేళ ఎమ్మెల్సీల‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కూడ‌ద‌న్న ఉద్దేశం ఉందా అంటే అది లేదు. ఎందుకంటే ఇప్ప‌టికే మంత్రులు నారాయ‌ణ‌, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఎమ్మెల్సీలుగా ఉంటూ మంత్రులైన‌వారేనని గుర్తు చేస్తున్నారు. తనను అధినాయకత్వం పట్టించుకోకపోవడం వల్లే కేశవ్ కూడా తన పని తాను చేసుకుపోతున్నారని చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News