టీడీపీకి షాక్ ఇచ్చిన భూమా!

భూమా నాగిరెడ్డి ఎసిసోడ్‌లోనూ టీడీపీ వ్యూహం బెడిసికొట్టిన‌ట్టే క‌నిపిస్తోంది. భూమా టీడీపీలో చేర‌డం జ‌రిగిపోయిన‌ట్టేన‌ని టీడీపీ , దాని అనుకూల మీడియా శుక్ర‌వారం నుంచి పెద్దెత్తున  ప్ర‌సారం చేసింది. అయితే ఒక టీవీ చాన‌ల్‌తో మాట్లాడిన భూమానాగిరెడ్డి మార‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. వైసీపీలోనే తాను కొన‌సాగుతున్న‌ట్టు తేల్చిచెప్పారు. భూమానాగిరెడ్డి… జగన్ తోనూ మాట్లాడారు. నాగిరెడ్డితో వైసీపీ నేత‌లు సుబ్బారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి జ‌రిగిన చ‌ర్చ‌ల త‌ర్వాత భూమా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు టీడీపీ త‌దుప‌రి […]

Advertisement
Update:2016-02-19 12:42 IST

భూమా నాగిరెడ్డి ఎసిసోడ్‌లోనూ టీడీపీ వ్యూహం బెడిసికొట్టిన‌ట్టే క‌నిపిస్తోంది. భూమా టీడీపీలో చేర‌డం జ‌రిగిపోయిన‌ట్టేన‌ని టీడీపీ , దాని అనుకూల మీడియా శుక్ర‌వారం నుంచి పెద్దెత్తున ప్ర‌సారం చేసింది. అయితే ఒక టీవీ చాన‌ల్‌తో మాట్లాడిన భూమానాగిరెడ్డి మార‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. వైసీపీలోనే తాను కొన‌సాగుతున్న‌ట్టు తేల్చిచెప్పారు. భూమానాగిరెడ్డి… జగన్ తోనూ మాట్లాడారు.

నాగిరెడ్డితో వైసీపీ నేత‌లు సుబ్బారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి జ‌రిగిన చ‌ర్చ‌ల త‌ర్వాత భూమా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు టీడీపీ త‌దుప‌రి వ్యూహం ఏమిట‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వ‌స్తున్నారంటూ అనుకూల మీడియా ద్వారా ప్ర‌చారం చేయించ‌డం చివ‌ర‌కు బొక్క‌బోర్లా ప‌డ‌డం ఇటీవ‌ల ప‌దేప‌దే జ‌రుగుతోంది. ఈ ప‌రిణామం వ‌ల్ల టీడీపీ ప‌రువుతో పాటు దాని అనుకూల మీడియా కూడా ప‌లుచ‌న అవుతోంది. అయితే భూమా ఎంతవరకు ఇదే స్టాండ్ మీద ఉంటారో చూడాలి. తాను పార్టీ వీడడం లేదన్న విషయం అన్ని చానళ్లతో కాకుండా ఒక చానల్ తోనే చెప్పడం చర్చనీయాంశమైంది. భూమా నాగిరెడ్డి మాట్లాడిన చానలే తొలుత వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఆ చానల్ ను చూసి మిగిలిన చానళ్లు అదే దారిలో వెళ్లాయి. మరి అలాంటి చానల్ తో మాత్రమే భూమా నాగిరెడ్డి మాట్లాడడం ఆసక్తిగా ఉంది.

Click on Image to Read

Tags:    
Advertisement

Similar News