ఎట్టెట్టా !... పెద్దాయ‌న క‌ల్లోకి వ‌చ్చి చెప్పాడా!

తెలంగాణ‌లో టీడీపీ బాధ్య‌త‌ల‌ను భుజాన వేసుకున్న రేవంత్ రెడ్డి కూక‌ట్‌ప‌ల్లిలో జ‌రిగిన పార్టీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. టీటీడీపీ ఎమ్మెల్యేలు రాజేంద‌ర్ రెడ్డి, వివేక్‌లు పార్టీ మారిన రోజు రాత్రి త‌న‌కు నిద్ర‌ప‌ట్ట‌లేద‌న్నారు. వివేక్‌, రాజేంద‌ర్ రెడ్డిలు పేద ప్ర‌జ‌ల ప‌క్షాన త‌న‌తో క‌లిసి మ‌రో 25 ఏళ్లు పోరాటం చేస్తార‌ని ఆశించాన‌న్నారు. అసెంబ్లీలో త‌న‌కు కుడిఎడ‌మ‌గా ఉన్న వారిఇద్దరిని చూసి సంతోషించేవాడిన‌న్నారు. కానీ అలాంటి వారు పార్టీ వీడ‌డం […]

Advertisement
Update:2016-02-18 17:38 IST

తెలంగాణ‌లో టీడీపీ బాధ్య‌త‌ల‌ను భుజాన వేసుకున్న రేవంత్ రెడ్డి కూక‌ట్‌ప‌ల్లిలో జ‌రిగిన పార్టీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. టీటీడీపీ ఎమ్మెల్యేలు రాజేంద‌ర్ రెడ్డి, వివేక్‌లు పార్టీ మారిన రోజు రాత్రి త‌న‌కు నిద్ర‌ప‌ట్ట‌లేద‌న్నారు. వివేక్‌, రాజేంద‌ర్ రెడ్డిలు పేద ప్ర‌జ‌ల ప‌క్షాన త‌న‌తో క‌లిసి మ‌రో 25 ఏళ్లు పోరాటం చేస్తార‌ని ఆశించాన‌న్నారు. అసెంబ్లీలో త‌న‌కు కుడిఎడ‌మ‌గా ఉన్న వారిఇద్దరిని చూసి సంతోషించేవాడిన‌న్నారు. కానీ అలాంటి వారు పార్టీ వీడ‌డం బాధేసింద‌న్నారు.

రాతంత్రా నిద్రపట్టలేదన్నారు. ఆ రోజు రాత్రి తెల్ల‌వారుజామున మ‌హానుభావుడు ఎన్టీఆర్ గుర్తుకొచ్చార‌ని చెప్పారు. ”పోయిన వారి కోసం బాధ‌ప‌డే కంటే ఉన్న కార్య‌క‌ర్త‌లను చూసి సంతోషించి ప‌నిచేయ్…” అని ఆయ‌న స్వ‌ర్గం నుంచి ఆదేశించిన‌ట్టుగా అనిపించిదన్నారు. ”కార్య‌క‌ర్త‌ల కోసం పోరాడు… నీ వెంట నేను ఉంటా అని స్వ‌ర్గం నుంచి ఆశీర్వ‌దించిన‌ట్టుగా” అనిపించింద‌న్నారు. పార్టీ ఎక్క‌డికి పోదు అని ఎన్టీఆర్ అన్నట్టుగా అనిపించింద‌ని రేవంత్ రెడ్డి అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News