బ్రేక‌ప్ గురించి అడిగితే...విరాట్ అలా అన్నాడు !

కార‌ణం  చెప్పేస్తే  అదొక్క‌టే ఉంటుంది, చెప్ప‌క‌పోతే వంద‌ల ఊహ‌లు పుడ‌తాయి. విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌ల‌కు  ఈ విష‌యం తెలియ‌క కాదు. అయినా వారిద్ద‌రూ త‌మ మ‌ధ్య బ్రేక‌ప్ ఎందుక‌య్యింది అనే విష‌యంమీద నోరు మెద‌ప‌టం లేదు. ఈ మ‌ధ్య తాను ప్ర‌చార‌క‌ర్త‌గా ఉన్న ఒక వాచ్ కంపెనీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో  విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు.  అక్క‌డ హాజ‌రైన జ‌ర్న‌లిస్టులు, అనుష్కతో బ్రేక‌ప్‌పై ప్ర‌శ్న‌లు సంధించి  అత‌డిని ముప్పుతిప్ప‌లు పెట్టేద్దామ‌నుకున్నారు.. కానీ విరాటే వారిమీద ఎదురుదాడికి దిగాడు. […]

Advertisement
Update:2016-02-18 08:24 IST

కార‌ణం చెప్పేస్తే అదొక్క‌టే ఉంటుంది, చెప్ప‌క‌పోతే వంద‌ల ఊహ‌లు పుడ‌తాయి. విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌ల‌కు ఈ విష‌యం తెలియ‌క కాదు. అయినా వారిద్ద‌రూ త‌మ మ‌ధ్య బ్రేక‌ప్ ఎందుక‌య్యింది అనే విష‌యంమీద నోరు మెద‌ప‌టం లేదు. ఈ మ‌ధ్య తాను ప్ర‌చార‌క‌ర్త‌గా ఉన్న ఒక వాచ్ కంపెనీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు. అక్క‌డ హాజ‌రైన జ‌ర్న‌లిస్టులు, అనుష్కతో బ్రేక‌ప్‌పై ప్ర‌శ్న‌లు సంధించి అత‌డిని ముప్పుతిప్ప‌లు పెట్టేద్దామ‌నుకున్నారు.. కానీ విరాటే వారిమీద ఎదురుదాడికి దిగాడు. ఏ ప‌నిమీద వ‌చ్చారో, ఆ ప‌నిచేసుకుని వెళ్లిపోండి అనే అర్థం ధ్వ‌నించేలా సున్నితంగా చుర‌క‌లు వేశాడు.

రిలేష‌న్ షిప్‌ల‌మీద లెక్చ‌ర్లు ఇవ్వ‌డానికి, వాటిని గురించి విశ్లేష‌ణ‌లు చేయ‌డానికి తాను కౌన్సెల‌ర్‌ని కాద‌న్నాడు. అందులో నిపుణులైన‌వారికి ఆ ప్ర‌శ్న‌లు వేయండి అన్నాడు. అతి ఖ‌రీదైన వాచీని ముందుగా ఎవ‌రికి ఇస్తారు…అని ప్ర‌శ్నించిన‌పుడు అత‌నికి మ‌రింత‌గా చిర్రెత్తుకొచ్చింది. మా కుటుంబ స‌భ్యుల్లో ఎవ‌రికైనా ఇస్తా…లేదంటే క్రికెట్ టీమ్‌లో ఒక‌రికి ఇవ్వ‌వ‌చ్చు. అస‌లు ఇక్క‌డ జ‌రుగుతున్న‌దానికి ఈ ప్ర‌శ్న‌ల‌కు సంబంధం ఏమైనా ఉందా, ప్ర‌శ్న‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించ‌కండి అన్నాడు… వారి ప్ర‌శ్న‌ల ప‌ట్ల త‌న అయిష్ట‌త‌ని వ్య‌క్తం చేస్తూ.

Click on Image to Read

Nikki Grilrani Stills

Tags:    
Advertisement

Similar News