నాన్నగారిలా పుస్తకాలు చదవాలి!
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి తన కూతురికి ఇదే సలహా ఇచ్చిందట. ఆద్యకు తానిచ్చిన ఒక చక్కని సలహా ఇదని రేణుదేశాయి చెబుతోంది. పవన్ కల్యాణ్‌కి పుస్తకాలంటే చాలా ఇష్టమని, ఖాళీ సమయాల్లో చదువుతూనే ఉంటారని ఇప్పటికే విని ఉన్నాం. పుస్తకాలు చదివే అలవాటు ఉంటే మనకు ఒంటరితనం అనేది ఉండదని రేణుదేశాయి కూతురితో చెప్పిందట. ఈ విషయంలో తండ్రినే ఆద్య ఆదర్శంగా తీసుకోవాలని రేణు భావిస్తున్నట్టుగా ఉంది. వవన్ కల్యాణ్‌తో విడిపోయాక రేణుదేశాయి […]
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి తన కూతురికి ఇదే సలహా ఇచ్చిందట. ఆద్యకు తానిచ్చిన ఒక చక్కని సలహా ఇదని రేణుదేశాయి చెబుతోంది. పవన్ కల్యాణ్‌కి పుస్తకాలంటే చాలా ఇష్టమని, ఖాళీ సమయాల్లో చదువుతూనే ఉంటారని ఇప్పటికే విని ఉన్నాం. పుస్తకాలు చదివే అలవాటు ఉంటే మనకు ఒంటరితనం అనేది ఉండదని రేణుదేశాయి కూతురితో చెప్పిందట.
ఈ విషయంలో తండ్రినే ఆద్య ఆదర్శంగా తీసుకోవాలని రేణు భావిస్తున్నట్టుగా ఉంది. వవన్ కల్యాణ్‌తో విడిపోయాక రేణుదేశాయి ఇష్క్‌వాలా లవ్ అనే పేరుతో ఒక మరాఠీ సినిమా తీశారు. ఇందులో పవన్ కుమారుడు అకిరానందన్ కూడా ఒక చిన్నపాత్రలో నటించాడు. ఈ సినిమాని తెలుగులోనూ విడుదల చేయాలని అనుకున్నారు కానీ అది కుదరలేదు. ప్రస్తుతం ఈ సినిమాని ఈ టివి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. సినిమాని ఈ టివి కొనుగోలు చేయడం వెనుక పవన్ కల్యాణ్ ప్రమేయం ఉన్నట్టుగా సమాచారం.
The best advice I gave to my little girl today is fall in love with reading, with books and you will never be lonely, ever.
— renu (@renuudesai) February 11, 2016