మళ్లీ తెరపైకి మోడీ పెళ్లి మ్యాటర్
ప్రధాని నరేంద్రమోడీ భార్య జశోదాబెన్ మరొకసారి సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకున్నారు. నరేంద్రమోడీ పాస్‌పోర్టులోని వివరాలు సమాచార హక్కు చట్టం ప్రకారం తనకు ఇవ్వాల్సిందిగా అహ్మదాబాద్ పాస్‌పోస్టు ప్రాంతీయ కార్యాలయాన్ని కోరారు. వివాహ ధృవీకరణ సర్టిఫికెట్ లేని కారణంగా తనకు పాస్‌పోర్టు నిరాకరించిన సదరు కార్యాలయంలో ఆమె ఈ మేరకు ఆర్‌టిఐ అప్లికేషనుని దాఖలు చేశారు. నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు విదేశాలకు వెళ్లారు. అప్పుడు ఆయన తన పాస్‌పోర్టులో వివాహానికి సంబంధించి ఎలాంటి వివరాలు, సర్టిఫికెట్లు […]
ప్రధాని నరేంద్రమోడీ భార్య జశోదాబెన్ మరొకసారి సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకున్నారు. నరేంద్రమోడీ పాస్‌పోర్టులోని వివరాలు సమాచార హక్కు చట్టం ప్రకారం తనకు ఇవ్వాల్సిందిగా అహ్మదాబాద్ పాస్‌పోస్టు ప్రాంతీయ కార్యాలయాన్ని కోరారు. వివాహ ధృవీకరణ సర్టిఫికెట్ లేని కారణంగా తనకు పాస్‌పోర్టు నిరాకరించిన సదరు కార్యాలయంలో ఆమె ఈ మేరకు ఆర్‌టిఐ అప్లికేషనుని దాఖలు చేశారు. నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు విదేశాలకు వెళ్లారు. అప్పుడు ఆయన తన పాస్‌పోర్టులో వివాహానికి సంబంధించి ఎలాంటి వివరాలు, సర్టిఫికెట్లు ఇచ్చారో తాను తెలుసుకోవాలనుకుంటున్నానని జశోదాబెన్ అన్నారు. గత నవంబరులో జశోదాబెన్ పాస్‌పోర్టుకోసం అప్లయి చేయగా వివాహ ధృవీకరణ పత్రం లేదనే కారణం చూపి తిరస్కరించారు. ఆమె తన సోదరునితో కలిసి పాస్‌పోర్టు కార్యాలయానికి వచ్చారు. జశోదాబెన్ ఇంతకుముందు కూడా ప్రధాని భార్యగా తనకు కల్పిస్తున్న భద్రత తాలూకూ వివరాలు కావాలని, సమాచార హక్కు చట్టం కింద పోలీసులను కోరారు.
Click on Image to Read: