అప్పుడు బ‌లుపు, ప‌వ‌ర్.. ఇప్పుడు `రాబిన్ హుడ్` ?

మ‌న హీరోలు న‌టించే చిత్రాల పేర్లు ఈ మ‌ధ్య కాలంలో చాల ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటున్నాయి. ముఖ్యంగా యాక్ష‌న్ చిత్రాలు చేసే హీరోల‌కు అయితే టైటిల్స్ మ‌రీ సౌండింగా ఉండేలా చూస్తున్నారు. ఈ మ‌ధ్య‌నే బెంగాల్ టైగ‌ర్ అనే చిత్రంతో అల‌రించిన మాస్ రాజా ర‌వితేజ లీడ్ రోల్ లో నిర్మాత దామోద‌ర ప్ర‌సాద్ ప్ర‌ణాళిక వేస్తున్నారు. ఈ చిత్రం తో చ‌క్రీ అనే కొత్త‌బ్బాయి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.ఈ సినిమాకు రాబిన్ హుడ్ అనే […]

Advertisement
Update:2016-02-09 06:53 IST

మ‌న హీరోలు న‌టించే చిత్రాల పేర్లు ఈ మ‌ధ్య కాలంలో చాల ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటున్నాయి. ముఖ్యంగా యాక్ష‌న్ చిత్రాలు చేసే హీరోల‌కు అయితే టైటిల్స్ మ‌రీ సౌండింగా ఉండేలా చూస్తున్నారు. ఈ మ‌ధ్య‌నే బెంగాల్ టైగ‌ర్ అనే చిత్రంతో అల‌రించిన మాస్ రాజా ర‌వితేజ లీడ్ రోల్ లో నిర్మాత దామోద‌ర ప్ర‌సాద్ ప్ర‌ణాళిక వేస్తున్నారు. ఈ చిత్రం తో చ‌క్రీ అనే కొత్త‌బ్బాయి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.ఈ సినిమాకు రాబిన్ హుడ్ అనే టైటిల్ అనుకున్న‌ట్లు టాక్. హీరోయిన్ గా రాశి ఖ‌న్నాను తీసుకుంటున్నార‌ని తెలుస్తుంది. మ‌రి చ‌రిత్ర‌లో రాబిన్ హుడ్ క్యారెక్ట‌ర్ యూరోపియన్ దేశాల‌కు చెందినది. ధ‌న‌వుంతుల్ని కొట్టి..బీద వాళ్ల‌కు పెట్టే వాడిగా రాబిన్ హుడ్ ప్ర‌సిద్ది . మ‌రి ఇదే టైటిల్ తో మ‌న ర‌వితేజ ఎవ‌రి ద‌గ్గ‌ర దోచుకుంటాడో… ఎవ‌రికి పంచి పెడ‌తాడో..?

Tags:    
Advertisement

Similar News