బాహుబలి మళ్లీ ఒళ్లు పెంచాడు!
బాహుబలి మొదటి భాగంలో భారీగా శరీరాన్ని పెంచి ఆ పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేశాడు ప్రభాస్. ఇప్పుడు బాహుబలి 2 కోసం మరింతగా శ్రమిస్తున్నాడు. కొడుకు పాత్రకోసం 130 కిలోల వరకు బరువు పెరిగిన ప్రభాస్, రెండవ భాగంలో తండ్రి పాత్రలో మరింత గంభీరంగా కనిపించాలి కాబట్టి ఇంకో 17 కేజీల బరువు పెరిగాడు. ప్రభాస్‌కి ఇంట్లోనే అమెరికా నుండి దిగుమతి చేసుకున్న వ్యాయామ పరికరాలతో జిమ్ ఉంది. అందులో ఆయన ఉదయం, సాయంత్రం రెండుపూటలా […]
బాహుబలి మొదటి భాగంలో భారీగా శరీరాన్ని పెంచి ఆ పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేశాడు ప్రభాస్. ఇప్పుడు బాహుబలి 2 కోసం మరింతగా శ్రమిస్తున్నాడు. కొడుకు పాత్రకోసం 130 కిలోల వరకు బరువు పెరిగిన ప్రభాస్, రెండవ భాగంలో తండ్రి పాత్రలో మరింత గంభీరంగా కనిపించాలి కాబట్టి ఇంకో 17 కేజీల బరువు పెరిగాడు. ప్రభాస్‌కి ఇంట్లోనే అమెరికా నుండి దిగుమతి చేసుకున్న వ్యాయామ పరికరాలతో జిమ్ ఉంది. అందులో ఆయన ఉదయం, సాయంత్రం రెండుపూటలా గంటన్నర చొప్పున చెమటోడుస్తున్నాడు. యోగా, డంబెల్స్, స్ట్రెచింగ్, కార్డియోవాస్క్యులర్ వ్యాయామాలు మొదలైనవి అతని డైలీ రొటీన్‌లో ఉన్నాయి. ప్రొటీన్లు, పిండిపదార్థాలు రెండూ సమపాళ్లలో ఉండేలా వెజ్, నాన్‌వెజ్ రెండురకాల ఆహారాన్ని తీసుకుంటున్నాడు.
ప్రభాస్ ఉదయపు ఆహారంలో 42 గుడ్లలోని తెలుపుసొన, పావుకిలో చికెన్, తాజా పళ్లు ఉంటాయట. మధ్యాహ్నం భోజనంలో ఏడు స్మాల్‌మీల్స్ బ్రౌన్‌రైస్, ఒట్‌మీల్, వెజ్ సలాడ్లు, సాయంత్రం వర్కవుట్ తరువాత ప్రొటీన్ పౌడర్‌తో కలిపిన పాలను రాత్రి డిన్నర్‌గా తీసుకుంటున్నాడట.