అసలు వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతోంది...
రణబీర్ కపూర్, కత్రినాకైఫ్ విడిపోయారనే విషయం అందరికీ తెలిసిందే. స్వయంగా కత్రినాకైప్ తల్లి రంగంలోకి దిగి బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పటికీ వర్కవుట్ కాలేదని సమాచారం. ప్రస్తుతం కత్రినాకైఫ్ కుటుంబంతో రణబీర్ కుటుంబీకులు అంటీముట్టనట్టు ఉంటున్నారనేది బహిరంగ రహస్యం. అయితే ఈ మేటర్ కంటే…. అసలు సల్మాన్ ఖాన్-కత్రినాకైఫ్ మధ్య ఏం జరుగుతోందనే మేటర్ పైనే అంతా ఇప్పుడు దృష్టిపెట్టారు. ఒకప్పుడు సల్మాన్-కత్రిన మధ్య గ్యాప్ బాగా ఉండేది. కానీ ఇప్పుడు కత్రినా కావాలనే సల్మాన్ కు క్లోజ్ […]
Advertisement
రణబీర్ కపూర్, కత్రినాకైఫ్ విడిపోయారనే విషయం అందరికీ తెలిసిందే. స్వయంగా కత్రినాకైప్ తల్లి రంగంలోకి దిగి బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పటికీ వర్కవుట్ కాలేదని సమాచారం. ప్రస్తుతం కత్రినాకైఫ్ కుటుంబంతో రణబీర్ కుటుంబీకులు అంటీముట్టనట్టు ఉంటున్నారనేది బహిరంగ రహస్యం. అయితే ఈ మేటర్ కంటే…. అసలు సల్మాన్ ఖాన్-కత్రినాకైఫ్ మధ్య ఏం జరుగుతోందనే మేటర్ పైనే అంతా ఇప్పుడు దృష్టిపెట్టారు. ఒకప్పుడు సల్మాన్-కత్రిన మధ్య గ్యాప్ బాగా ఉండేది. కానీ ఇప్పుడు కత్రినా కావాలనే సల్మాన్ కు క్లోజ్ అవుతోందని సమాచారం. ఈమధ్య కండలహీరో 50వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటే… అతడి కుటుంబ సభ్యులతో పాటు అక్కడున్న పరాయి వ్యక్తి కేవలం కత్రినా మాత్రమే. ఇది చాలదన్నట్టు ప్రస్తుతం ఆమె చేస్తున్న ఫితూర్ అనే సినిమా పనుల్ని సల్మాన్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. విడుదలకు ముందే సినిమా చూసి కొన్ని మార్పులుచేర్పులు చెప్పాడట. మరోవైపు లండన్ లో కత్రినాకు సంబంధించి ఒక ఆర్థిక లావాదేవీని కూడా సల్మాన్ సెటిల్ చేశాడని చెబుతున్నారు. ఇలా కత్రినాపై సల్మాన్ ఖాన్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తూనే… తను ఇక పెళ్లి చేసుకోనని ప్రకటించడం విశేషం.
Advertisement