ఇక విరాట్ సింగిల్ అట...
పెళ్లయి విడిపోవడం పాత స్టయిల్. పెళ్లి కాకముందే కొన్నాళ్లు డేటింగ్ చేసి విడిపోవడం ఇప్పుడు నయా ట్రెండ్. బాలీవుడ్ లో అంతా ఇదే ఫాలో అవుతున్నారు. హృతిక్ రోషన్… పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన తర్వాత భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇదొక్కటి మినహాయిస్తే… మిగతావన్నీ కొత్త ట్రెండ్ లోనే నడుస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి అనుష్క శర్మ-విరాట్ కోహ్లి జంట కూడా చేరిపోయింది. మొన్నటివరకు ప్రేమపక్షుల్లా దేశాలన్నీ చుట్టేసిన ఈ జంట.. ఇప్పుడు […]
Advertisement
పెళ్లయి విడిపోవడం పాత స్టయిల్. పెళ్లి కాకముందే కొన్నాళ్లు డేటింగ్ చేసి విడిపోవడం ఇప్పుడు నయా ట్రెండ్. బాలీవుడ్ లో అంతా ఇదే ఫాలో అవుతున్నారు. హృతిక్ రోషన్… పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన తర్వాత భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇదొక్కటి మినహాయిస్తే… మిగతావన్నీ కొత్త ట్రెండ్ లోనే నడుస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి అనుష్క శర్మ-విరాట్ కోహ్లి జంట కూడా చేరిపోయింది. మొన్నటివరకు ప్రేమపక్షుల్లా దేశాలన్నీ చుట్టేసిన ఈ జంట.. ఇప్పుడు ఎడమొహం-పెడమొహంగా ఉంటోంది. వీళ్లిద్దరూ విడిపోయారనే వార్తలు కేవలం అవాస్తవాలని అంతా అనుకున్నప్పటికీ… ఈ బ్రేకప్ ను విరాట్ కోహ్లి తాజాగా కన్ ఫర్మ్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే సోషల్ నెట్ వర్కింగ్ లో అనుష్క శర్మను ఫాలో అవ్వడం మానేసిన కోహ్లి….. రీసెంట్ గా జరిగిన ఓ నైట్ పార్టీలో తను సింగిల్ గానే ఉన్నానంటూ ప్రకటించాడట. మొన్న ఆదివారం… నటుడు అంగద్ బేడీ బర్త్ డే వేడుకకు హాజరైన కోహ్లి…. తను సింగిల్ గా ఉన్నానని… ఏ అమ్మాయి అయినా తనతో డాన్స్ చేయొచ్చని ప్రకటించాడట. ఇతడి కంటే ముందే కత్రినా-రణబీర్ విడిపోయిన విషయం తెలిసిందే.
Advertisement