రవితేజ సినిమా ఆగిపోవడానికి కారణమిదే ?
మాస్ రాజా రవితేజ ఓ సినిమాకు ఓకే చెప్పాడంటే… క్షణాల్లో అది సెట్స్ పైకి వెళ్తుంది. అంతేవేగంగా షూటింగ్ కూడా జరుపుకుంటుంది. అలా ఏడాదిగి నాలుగైదు సినిమాలు చేసిన ట్రాక్ రికార్డు కూడా రవితేజకు ఉంది. కానీ ఓ సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకో వడం మాత్రం రవితేజ కెరీర్ లో అరుదుగా జరుగుతుంది. తాజాగా అలా ఓ సినిమా అగిపోయింది కాబట్టే అది సంచలనం అయింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ […]
Advertisement
మాస్ రాజా రవితేజ ఓ సినిమాకు ఓకే చెప్పాడంటే… క్షణాల్లో అది సెట్స్ పైకి వెళ్తుంది. అంతేవేగంగా షూటింగ్ కూడా జరుపుకుంటుంది. అలా ఏడాదిగి నాలుగైదు సినిమాలు చేసిన ట్రాక్ రికార్డు కూడా రవితేజకు ఉంది. కానీ ఓ సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకో వడం మాత్రం రవితేజ కెరీర్ లో అరుదుగా జరుగుతుంది. తాజాగా అలా ఓ సినిమా అగిపోయింది కాబట్టే అది సంచలనం అయింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రవితేజ చేయాల్సిన సినిమా ఆగిపోయింది. దీనికి కారణం పారితోషికమ అని తెలుస్తోంది. రవితేజ, దిల్ రాజు మధ్య రెమ్యూనరేషన్ విషయంలో సెట్ కాక…. మాస్ రాజా ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు చెబుతున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయాల్సిన ఎవడో ఒకడు సినిమా కోసం రవితేజ 9 కోట్ల రూపాయలు అడిగాడట. కానీ దిల్ రాజు మాత్రం 6కోట్లు మాత్రమే ఇస్తానన్నాడట. ఈమధ్య వచ్చిన కిక్-2, బెంగాల్ టైగర్ సినిమాలు ఫ్లాప్ అయిన విషయాన్ని సాకుగా చూపాడట. దీంతో ఆ ప్రాజెక్టు నుంచి రవితేజ తప్పుకున్నాడని సమాచారం.
Advertisement