అధికారుల షుగర్ లెవల్స్‌ను పడగొట్టిన బాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించే సుధీర్ఘ సమీక్షలు అధికారుల్లో గుబులు లేపుతున్నాయి. వయసు మీద పడ్డవారు, బీపీ షుగర్‌ ఉన్న అధికారులు … సీఎం రివ్క్యూ అంటే వణికిపోతున్నారు. తాజాగా బుధవారం సీఎం సమీక్షకు వెళ్లిన ముగ్గురు అధికారులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ఏడు గంటల వరకు   రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే కేబినెట్ భేటీ, సీఎం ప్రెస్‌మీట్ చాలా ఆలస్యంగా సాగడంతో రాత్రి 9.30గంటలకు ఆర్ […]

Advertisement
Update:2016-02-05 07:04 IST

ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించే సుధీర్ఘ సమీక్షలు అధికారుల్లో గుబులు లేపుతున్నాయి. వయసు మీద పడ్డవారు, బీపీ షుగర్‌ ఉన్న అధికారులు … సీఎం రివ్క్యూ అంటే వణికిపోతున్నారు. తాజాగా బుధవారం సీఎం సమీక్షకు వెళ్లిన ముగ్గురు అధికారులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ఏడు గంటల వరకు రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే కేబినెట్ భేటీ, సీఎం ప్రెస్‌మీట్ చాలా ఆలస్యంగా సాగడంతో రాత్రి 9.30గంటలకు ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష మొదలైంది. రాత్రి 12. 45 నిమిషాల వరకు అది సాగింది.

సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12.45 నిమిషాల వరకు అధికారులు ఎలాంటి ఆహారం తీసుకోలేకపోయారు. చంద్రబాబు మాత్రం మధ్యలో వెళ్లి భోజనం చేసి వచ్చి కూర్చుకున్నారు. ఇంజనీర్లకు తిండిలేదు. సమీక్షకు వచ్చిన వారిలో ముగ్గురు అధికారుల షుగర్‌ లెవల్స్ పడిపోయాయి. ఒక అధికారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి చెందిన మహిళా డాక్టర్‌ను పిలిపించి ఇంజెక్షన్ వేయించబోయారు. అయితే ఆహారం తీసుకోకుండా ఇంజెక్షన్ వేయడం వల్ల ఇబ్బందులొస్తాయని డాక్టర్ చెప్పడం అప్పటికప్పుడు ఒక స్వీట్ ముక్క తినిపించారు. అర్థరాత్రి తర్వాత సమీక్ష ముగించుకుని బయటకు వస్తే హోటల్స్‌ అన్ని మూసివేసి ఉన్నాయి. దీంతో ఉన్నతాధికారులు రోడ్లపై వెతుక్కుంటూ వెళ్లారు.

చివరకు ఒక చోట్ల ఇడ్లీ బండి కనిపించగా బతికిపోయంరా దేవుడా అంటూ రోడ్డు పక్కన ఇడ్లీలు తినేసి వచ్చారు. జనవరి 1న జరిగిన సమావేశంలోనూ ఉన్నతాధికారులు ఇలాగే రోడ్లపైన అర్థరాత్రి అల్పహారం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. సీఎం తన సమావేశాల విషయంలో కాస్త టైమింగ్ పాటిస్తే బాగుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కానీ సీఎంకు నేరుగా ఈ విషయం చెప్పే ధైర్యం లేక అలాగే నెట్టుకొస్తున్నారు.

Click on image to Read

Tags:    
Advertisement

Similar News