గాల్లో అతని పాట...వారి ఉద్యోగాలను గాల్లో కలిపింది!
జెట్ ఎయిర్‌వేస్ విమానయాన సంస్థ, సినీ గాయకుడు సోను నిగంని విమానంలో పాడేందుకు అనుమతించిన విమాన సిబ్బందిని సస్పెండ్ చేసింది. గత నెల నాలుగో తేదీన ముంబయినుండి జోధ్‌పూర్ వెళుతున్న జెట్ ఎయిర్‌వేస్ చార్టర్డ్ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, అందులోనే ప్రయాణిస్తున్న బాలివుడ్ గాయకుడు సోను నిగంని తమ కోసం పాట పాడాల్సిందిగా కోరి పాడించుకున్నారు. విమాన సిబ్బంది అందుకు అనుమతించగా, సోను నిగం విమానంలో ఎనౌన్స్‌మెంట్ చేసే అడ్రస్ సిస్టమ్ నుండి రెండు పాపులర్ పాటలను […]
జెట్ ఎయిర్‌వేస్ విమానయాన సంస్థ, సినీ గాయకుడు సోను నిగంని విమానంలో పాడేందుకు అనుమతించిన విమాన సిబ్బందిని సస్పెండ్ చేసింది. గత నెల నాలుగో తేదీన ముంబయినుండి జోధ్‌పూర్ వెళుతున్న జెట్ ఎయిర్‌వేస్ చార్టర్డ్ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, అందులోనే ప్రయాణిస్తున్న బాలివుడ్ గాయకుడు సోను నిగంని తమ కోసం పాట పాడాల్సిందిగా కోరి పాడించుకున్నారు. విమాన సిబ్బంది అందుకు అనుమతించగా, సోను నిగం విమానంలో ఎనౌన్స్‌మెంట్ చేసే అడ్రస్ సిస్టమ్ నుండి రెండు పాపులర్ పాటలను పాడి విమానంలోని వారిని అలరించాడు. ఆ వీడియోలను పాసింజర్ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది బాగా వైరల్ అయిపోయింది. వాటిని చూసిన సివిల్ ఏవియేషన్ డైరక్టర్ జనరల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం జరిగిన పరిణామ క్రమంలో ఆ రోజు సోనునిగంని పాడేందుకు అనుమతించిన విమాన సిబ్బందిని జెట్ ఎయిర్‌వేస్ సంస్థ సరిగ్గా నెల తరువాత సస్పెండ్ చేసింది. దీనిపై సోనూ నిగం తీవ్ర నిరసన తెలిపాడు. విమానాల్లో అతిపెద్ద ష్యాషన్ షోలు నిర్వహించడం, చిన్నపాటి గాన కచ్చేరీలు చేయడం తనకు తెలుసునని, విమానంలో ఉన్నవారిని ఆనందపరిచే అవకాశం ఇచ్చిన సిబ్బందిని సస్పెండ్ చేయడం అసహన ధోరణి అంటూ ఆక్రోశించాడు. మొత్తంమీద గాల్లోపాడిన ఆయన పాటలు, సిబ్బంది ఉద్యోగాలను గాల్లో కలిపాయి.
https://youtu.be/y6PqI6UMYx8