చెవి సవాల్‌పై నారాయణ స్పందన అదుర్స్

గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ వంద స్థానాలు గెలిస్తే చెవి కోసుకుంటా అని సవాల్ చేసిన  నారాయణ ప్లేట్ ఫిరాయించారు.  చెవి కోసుకుంటామనగానే కోసేసుకుంటామా ఏంటి అని ప్రశ్నించారు. చెవి సవాల్‌ను స్పోర్టివ్‌గా తీసుకోవాలన్నారు. జనంలోకి వెళ్లినప్పుడు  ఆమాత్రం ఊపున్న మాటలు రావడం సహజమన్నారు నారాయణ. చాలా మంది నేతలు మెడకాయ నరుక్కుంటామని చెప్పారు… వారంతా నిజంగా నరికేసుకున్నారా! అని ప్రశ్నించారు. మాట వరుసకు చంపేస్తాం అంటామ్… ఆ మాత్రాన నిజంగానే చంపేస్తామా అని ఎదురు ప్రశ్నించారు. అధికార పార్టీ […]

Advertisement
Update:2016-02-05 13:37 IST

గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ వంద స్థానాలు గెలిస్తే చెవి కోసుకుంటా అని సవాల్ చేసిన నారాయణ ప్లేట్ ఫిరాయించారు. చెవి కోసుకుంటామనగానే కోసేసుకుంటామా ఏంటి అని ప్రశ్నించారు. చెవి సవాల్‌ను స్పోర్టివ్‌గా తీసుకోవాలన్నారు. జనంలోకి వెళ్లినప్పుడు ఆమాత్రం ఊపున్న మాటలు రావడం సహజమన్నారు నారాయణ.

చాలా మంది నేతలు మెడకాయ నరుక్కుంటామని చెప్పారు… వారంతా నిజంగా నరికేసుకున్నారా! అని ప్రశ్నించారు. మాట వరుసకు చంపేస్తాం అంటామ్… ఆ మాత్రాన నిజంగానే చంపేస్తామా అని ఎదురు ప్రశ్నించారు. అధికార పార్టీ నోట్లను ఖర్చు పెట్టిందని… తాము నోటిని మాత్రమే ఖర్చు పెట్టగలిగామన్నారు. ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ను అభినందిస్తున్నానని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా సిటీలో నీరు, కరెంట్ వంటి సమస్యలను పరిష్కరించిందని జనం దాన్ని చూసి కూడా ఓటేశారని నారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయం కూడా మంచిది కాదన్న భావన ప్రజల్లో వ్యక్తమైందని నారాయణ విశ్లేషించారు.

Click on image to Read

Tags:    
Advertisement

Similar News