కేజ్రీవాల్‌కి ఆ వ్యాపార‌వేత్త 364 రూపాయ‌లు ఎందుకు పంపాడు?

సామాన్యుల కోసం ప‌నిచేస్తామ‌ని వ‌చ్చాం…. క‌నుక నేనూ సామాన్యునిలాగే ఉండాల‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్‌ కేజ్రీవాల్ అనుకుంటారు.  అందుకే రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్లో జ‌రిగిన ఒక‌ విందుపార్టీకి ఆయ‌న మామూలు సాధార‌ణ చెప్పులు వేసుకుని అటెండ్ అయ్యారు. అయితే దానికి ఒక పౌరుడి నుండి ఇలాంటి స్పంద‌న వ‌స్తుంద‌ని కేజ్రీవాల్ ఊహించి ఉండ‌రు. ఫ్రెంచి అధ్య‌క్షుడు ఫ్రాంకొయిస్‌ హొలాండే గౌర‌వార్ధం రాష్ట్ర‌ప‌తి ఇచ్చిన విందుకి కేజ్రీవాల్ హాజ‌ర‌య్యారు. ఆ విందులో ఆయ‌న‌ సాధార‌ణ చెప్పుల‌తో మీడియా ఫొటోల్లో క‌నిపించారు. […]

Advertisement
Update:2016-02-04 10:37 IST

సామాన్యుల కోసం ప‌నిచేస్తామ‌ని వ‌చ్చాం…. క‌నుక నేనూ సామాన్యునిలాగే ఉండాల‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్‌ కేజ్రీవాల్ అనుకుంటారు. అందుకే రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్లో జ‌రిగిన ఒక‌ విందుపార్టీకి ఆయ‌న మామూలు సాధార‌ణ చెప్పులు వేసుకుని అటెండ్ అయ్యారు. అయితే దానికి ఒక పౌరుడి నుండి ఇలాంటి స్పంద‌న వ‌స్తుంద‌ని కేజ్రీవాల్ ఊహించి ఉండ‌రు. ఫ్రెంచి అధ్య‌క్షుడు ఫ్రాంకొయిస్‌ హొలాండే గౌర‌వార్ధం రాష్ట్ర‌ప‌తి ఇచ్చిన విందుకి కేజ్రీవాల్ హాజ‌ర‌య్యారు. ఆ విందులో ఆయ‌న‌ సాధార‌ణ చెప్పుల‌తో మీడియా ఫొటోల్లో క‌నిపించారు. దీంతో ఆశ్చ‌ర్య‌పోయిన విశాఖ‌ప‌ట్ట‌ణం వ్యాపార‌వేత్త సుమిత్ అగ‌ర్వాల్ ఆయ‌న‌కు 364 రూపాయ‌లు డిమాండ్ డ్రాఫ్ట్ పంపుతూ ఫార్మ‌ల్ షూ కొనుక్కోమ‌ని కోరాడు. కేజ్రీవాల్‌కి ఒక బ‌హిరంగ లేఖ కూడా రాశాడు. కేజ్రీవాల్, ఆ స‌మ‌యంలో ఆమ్ ఆద్మీ పార్టీ త‌ర‌పున రామ్‌లీలా మైదాన్‌లో లేదా జంత‌ర్‌మంత‌ర్‌లో జ‌రుగుతున్న ఏ ధ‌ర్నాలోనో లేర‌ని, ఒక దేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నార‌ని సుమిత్ పేర్కొన్నాడు. ఎవ‌రికి న‌చ్చిన‌ట్టుగా వారు ఉండే అధికారం అంద‌రికీ ఉంటుంద‌ని, కానీ కేజ్రీవాల్ ఇలాంటి సంద‌ర్భాల్లో మాత్రం ప‌రిస్థితుల‌కు అనుగుణంగా త‌న‌ని తాను మ‌ల‌చుకోవాల‌ని సుమిత్ అగ‌ర్వాల్ త‌న లేఖ‌లో కోరాడు. ముఖ్యంగా విదేశీ అతిథులు వ‌చ్చిన‌పుడు త‌ప్ప‌నిస‌రిగా ఇవ‌న్నీ పాటించాల‌ని ఆయ‌న కోరాడు. తాను పంపిన డ‌బ్బులో త‌న‌వి 49 రూపాయ‌లున్నాయ‌ని, మిగిలివ‌న్నీ ఒక ఆదివారం మ‌ధ్యాహ్న‌మంతా క‌ష్ట‌ప‌డి సేక‌రించాన‌ని సుమిత్ లేఖ‌లో పేర్కొన్నాడు.

Tags:    
Advertisement

Similar News