ఈ అమ్మాయి గురించి మీకు తెలుసా?
సాధారణంగా టీవీల్లో యాడ్ వస్తే వెంటనే రిమోట్ పక్క చానల్ వైపు వెళ్లిపోతుంది. కానీ ఒక్క యాడ్ వస్తే మాత్రం జనం అలా చూస్తూనే ఉండిపోతారు. అదే ఎయిర్‌టెల్ 4G యాడ్. ఈ ప్రకటన చూస్తూ ఉండిపోవడానికి కారణం ఎయిర్‌టెల్ 4Gలోని ఫీచర్స్ కాదు. యాడ్‌లో కనిపించే అమ్మాయి హవభావాలు అలా కట్టిపడేస్తాయి. ఈ ప్రకటనకు వచ్చినంత ఆదరణ మరే ప్రకటనకు రాలేదు. ఈ ప్రకటనలో నటించిన అమ్మాయి పేరు ససా చెట్రీ. డెహ్రడూన్‌కు చెందిన చెట్రీ […]
సాధారణంగా టీవీల్లో యాడ్ వస్తే వెంటనే రిమోట్ పక్క చానల్ వైపు వెళ్లిపోతుంది. కానీ ఒక్క యాడ్ వస్తే మాత్రం జనం అలా చూస్తూనే ఉండిపోతారు. అదే ఎయిర్‌టెల్ 4G యాడ్. ఈ ప్రకటన చూస్తూ ఉండిపోవడానికి కారణం ఎయిర్‌టెల్ 4Gలోని ఫీచర్స్ కాదు. యాడ్‌లో కనిపించే అమ్మాయి హవభావాలు అలా కట్టిపడేస్తాయి. ఈ ప్రకటనకు వచ్చినంత ఆదరణ మరే ప్రకటనకు రాలేదు. ఈ ప్రకటనలో నటించిన అమ్మాయి పేరు ససా చెట్రీ. డెహ్రడూన్‌కు చెందిన చెట్రీ ముంబాయిలోని జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ సంస్థలో కాపి రైటర్‌గా పనిచేసింది.
మెడలింగ్ ఏజెన్సీల్లో తన పేరు నమోదైంది. అయితే 4G ప్రకటనతో చెట్రీ ఒవర్‌నైట్ సెలబ్రేటీగా మారిపోయింది. ఆమె నటించిన 4G యాడ్ ఎంతగా పాపులర్ అయిందంటే బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రిసెర్చ్ కౌన్సిల్ ఇండియా లెక్కల ప్రకారం రెండు నెలల వ్యవధిలో 54, 406 సార్లు టెలికాస్ట్ అయింది. ఇదో రికార్డ్. అంటే రెండునెల్లలో 475 గంటల పాటు చెట్రీ టీవీ స్ర్కీన్‌లపై కనిపించింది. ఆ సమయాన్ని రోజుల్లోకి మారిస్తే మొత్తం 20 రోజులవుతుంది.
ఎయిర్‌టెల్ 4G కంటే చెట్రీకే ఎక్కువ పేరు వచ్చేసింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ 4G ప్రకటనను చెట్రీ లేకుండా ఊహించుకోలేని స్థాయిలో ఆమె ప్రభావం చూపింది. కంగనారనౌత్, ఇమ్రాన్ ఖాన్ కలిసి నటించిన కట్టిబట్టి సినిమాలోనూ చెట్రీ తళుక్కున మెరుస్తుంది. కానీ ఆ సినిమా వల్ల పెద్దగా గుర్తింపు రాలేదు. ఎయిర్‌టెల్ యాడ్ తర్వాత అనేక యాడ్ ఏజెన్సీలు చెట్రీ వెంటపడుతున్నాయి. టాలీవుడ్ లోని హిట్ల పరంపర కొనసాగిస్తున్న ఓ ప్రముఖ దర్శకుడు కూడా ఈ అమ్మాయిని తన తదుపరి చిత్రంలోకి ఓ కీలక పాత్ర విషయంలో సంప్రదించినట్టు ఫిలింనగర్ టాక్.