బంధు మిత్రుల మధ్య సంఘవి వివాహం
నటి సంఘవి వివాహాం ..బెంగళూరు లో బుధవారం బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. వెంకటేష్ అనే సాఫ్ట్ వేర్ కెంపెనీ యజమానితో సంఘవి పెళ్లి జరిగింది. వీరిద్దరికి కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. అలా ప్రేమలో పడి .. పెద్దల అంగీకారంతో వివాహాం చేసుకున్నారు. ఈ వివాహానికి నటి మీనా కూడా అటెండ్ అయ్యారు. తెలుగు అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ల సరసన నటించిన ట్రాక్ రికార్డు నటి సంఘవి కి […]
నటి సంఘవి వివాహాం ..బెంగళూరు లో బుధవారం బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. వెంకటేష్ అనే సాఫ్ట్ వేర్ కెంపెనీ యజమానితో సంఘవి పెళ్లి జరిగింది. వీరిద్దరికి కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. అలా ప్రేమలో పడి .. పెద్దల అంగీకారంతో వివాహాం చేసుకున్నారు. ఈ వివాహానికి నటి మీనా కూడా అటెండ్ అయ్యారు. తెలుగు అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ల సరసన నటించిన ట్రాక్ రికార్డు నటి సంఘవి కి ఉంది. 95 నుంచి ..2005 వరకు తెలుగు , తమిళ, కన్నడ ఇండస్ట్రీలో చాల బిజీగా వున్న సంఘవి. కెరీర్ లో హీరోయిన్ గా ఆఫర్స్ తగ్గిపోతున్న సమయంలో పూర్తిగా మేకప్ కు దూరంగా ఉంది. తమిళ్ లో రజనీకాంత్ సరసన బాబా చిత్రంలో నటించింది. మృగరాజు చిత్రంలో చిరంజీవితో.. సమరసింహరెడ్డి చిత్రంలో బాలయ్యతో.. సూర్య వంశంలో వెంకటేష్‌తో.. సీతరామరాజు చిత్రంలో నాగార్జునతోనూ నటించి మెప్పించింది. గ్లామర్..అభినయం రెండు వున్న నటిగా పేరు సంపాదించుకుంది సంఘవి. దర్శకుడు వై వియస్ చౌదరి చేసిన 'ఇంద్రాణి'లో నటించి ఆ తరువాత సంఘవి నటన నుంచి విరామం తీసుకున్నారు.