రేవతి ద‌ర్శ‌క‌త్వం...సుహాసిని మాట‌లు...

తెలుగు త‌మిళ భాష‌ల్లో క్వీన్‌! హిందీ సినిమా క్వీన్ తెలుగు రీమేక్‌పై ఇప్ప‌టికే చాలా వార్త‌లు వ‌చ్చాయి.  కంగ‌నా ర‌నౌత్ పాత్ర ఎవ‌రు చేయ‌బోతున్నారు అనేది కూడా అత్యంత ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ప‌రిస్థితుల్లో ఎట్ట‌కేల‌కు ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్క‌నుంది. ప్ర‌ముఖ బ‌హుభాషా న‌టి రేవ‌తి దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అంత‌కంటే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే రెండు భాష‌ల్లోనూ  సుహాసినీ మ‌ణిర‌త్నం దీనికి మాట‌లు అందించ‌నున్నారు. అయితే న‌టీన‌టుల ఎంపిక జ‌ర‌గాల్సి […]

Advertisement
Update:2016-02-03 06:52 IST

తెలుగు త‌మిళ భాష‌ల్లో క్వీన్‌!

హిందీ సినిమా క్వీన్ తెలుగు రీమేక్‌పై ఇప్ప‌టికే చాలా వార్త‌లు వ‌చ్చాయి. కంగ‌నా ర‌నౌత్ పాత్ర ఎవ‌రు చేయ‌బోతున్నారు అనేది కూడా అత్యంత ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ప‌రిస్థితుల్లో ఎట్ట‌కేల‌కు ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్క‌నుంది. ప్ర‌ముఖ బ‌హుభాషా న‌టి రేవ‌తి దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అంత‌కంటే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే రెండు భాష‌ల్లోనూ సుహాసినీ మ‌ణిర‌త్నం దీనికి మాట‌లు అందించ‌నున్నారు. అయితే న‌టీన‌టుల ఎంపిక జ‌ర‌గాల్సి ఉంది. 2013లో హిందీలో రిలీజైన ఈ సినిమా మంచి విజ‌యం సాధించి, కంగ‌నా ర‌నౌత్‌కి న‌టిగా పేరు తెచ్చిపెట్టింది.

ఇందులో క‌థ చాలా సింపుల్‌. ఒక పంజాబీ అమ్మాయికి పెళ్లి జ‌రుగుతుంది. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమె భ‌ర్తతో విడిపోవ‌డంతో ఆమె ఒక్క‌తే హ‌నీమూన్ ప్లేస్ పారిస్‌కి వెళ్లాల్సి వ‌స్తుంది. అక్క‌డ ఆమె భిన్న‌మైన ప‌రిస్థితుల‌కు గురై త‌న‌లోని భిన్న కోణాల‌ను గురించి తెలుసుకోవ‌డ‌మే క‌థ‌. సుహాసిని ఇప్ప‌టికే సినిమా మొద‌టి భాగానికి డైలాగ్స్ సిద్ధం చేశారు. మ‌రో రెండుమూడు నెల‌ల్లో మిగిలిన‌ది పూర్తి చేస్తారు. అనంత‌రం ఈ ఏడాది చివ‌ర్లో ఇది సెట్స్‌మీద‌కు వెళుతుంది. తమిళ న‌టుడు, హీరో ప్ర‌శాంత్ తండ్రి త్యాగ‌రాజ‌న్ దీన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంగా తెర‌కెక్కి వంద కోట్ల క్ల‌బ్‌లో చేరి సంచ‌ల‌నం సృష్టించిన ఈ సినిమా తెలుగు, త‌మిళంల‌లో ఎలాంటి సంచ‌నాలు సృష్టిస్తుందో, మ‌హిళా ద‌ర్శ‌కురాలికి ఎంత పేరు తెచ్చిపెడుతుందో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News