అమ్మో..! జుట్టు రంగుకి అర‌కోటి ..!

జుట్టు రంగుకు అర‌కోటిరూపాయాలు ఖ‌ర్చు చేసిందంటే వినడానికి ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే. కానీ ఇది నిజమనే అంటున్నారు బాలీవుడ్ లో క‌త్రీనా కైఫ్ స‌న్నిహితులు. ప్ర‌స్తుతం క‌త్రీనా కైఫ్ ఫితూర్ అనే చిత్రంలో న‌టిస్తుంది. ఈ సినిమాలో స్పెష‌ల్ హెయిర్ స్టైల్ కోసం క‌త్రీనా జుట్టుకు 55 ల‌క్ష‌లు ఖ‌ర్చు అయ్యింద‌ట. ఈ సినిమాలో క‌త్రీనా ఒక ర‌క‌మైన ఎరుపు రంగు జుట్టులో క‌నిపించ‌నుంద‌ట. ఫ‌స్ట్ ముంబాయ్ హెయిర్ స్టైలిస్ట్ తో చేయిస్తే న‌చ్చ‌లేద‌ట. ఆ త‌రువాత […]

Advertisement
Update:2016-01-31 00:34 IST

జుట్టు రంగుకు అర‌కోటిరూపాయాలు ఖ‌ర్చు చేసిందంటే వినడానికి ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే. కానీ ఇది నిజమనే అంటున్నారు బాలీవుడ్ లో క‌త్రీనా కైఫ్ స‌న్నిహితులు. ప్ర‌స్తుతం క‌త్రీనా కైఫ్ ఫితూర్ అనే చిత్రంలో న‌టిస్తుంది. ఈ సినిమాలో స్పెష‌ల్ హెయిర్ స్టైల్ కోసం క‌త్రీనా జుట్టుకు 55 ల‌క్ష‌లు ఖ‌ర్చు అయ్యింద‌ట. ఈ సినిమాలో క‌త్రీనా ఒక ర‌క‌మైన ఎరుపు రంగు జుట్టులో క‌నిపించ‌నుంద‌ట. ఫ‌స్ట్ ముంబాయ్ హెయిర్ స్టైలిస్ట్ తో చేయిస్తే న‌చ్చ‌లేద‌ట. ఆ త‌రువాత క‌త్రీనా లండ‌న్ లో త‌న‌కు తెలిసిన హెయిర్ స్టైలిస్ట్ తో చేయించుకుంద‌ట. సినిమా షూటింగ్ జ‌రిగినంత కాలం క‌త్రీనా ప్ర‌త్యేకంగా లండ‌న్ వెళ్లి త‌న‌కు తెలిసిన హెయిర్ స్టైలిస్ట్ తో క‌ల‌రింగ్ చేయించుకుని వ‌చ్చేద‌ట. ఫ‌స్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్ట్.. ఫైవ్ స్టార్ హోట‌ల్లో క‌త్రీనా బ‌స… ఆ హెయిర్ స్టెలిస్ట్ చార్జీ అన్ని క‌లిపి సినిమా పూర్తి అయ్యే స‌రికి నిర్మాత‌కు 55 ల‌క్ష‌లు ఖ‌ర్చు వ‌చ్చింద‌ట. ఇది విన్న వారు ఈ సినిమా ప్రొడ్యూస‌ర్స్ సిద్ధార్ద్ రాయ్ క‌పూర్, అభిషేక్ బ‌చ్చ‌న్ ల‌ను అభినందించ‌కుండ ఉండ‌లేక పోతున్నార‌ట. వ‌చ్చెనెల లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

Tags:    
Advertisement

Similar News