ఆ ప్రచారంలో నిజం లేదంటున్న కీర్తి సురేష్
విజయం చాలా పనులు చేస్తుంది. సంతోషాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అవకాశాలను పెంచుతుంది. ముఖ్యంగా పారితోషికాన్ని రెట్టింపు చేస్తుంది. ఎవరు కాదన్నా అవునన్నా ఇది నిజం. ఇక నటి కీర్తి సురేష్ కూడా ఇందుకు అతీతం కాదు. ఇదు ఎన్న మైకం చిత్రంతో కోలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ సీనియర్ నటి మేనక సురేష్ వారసురాలన్న విషయం తెలిసిందే. మాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు చేసిన కీర్తిసురేష్‌పై పొరుగు రాష్ట్రాల చిత్ర దర్శక నిర్మాతల దృష్టి […]
విజయం చాలా పనులు చేస్తుంది. సంతోషాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అవకాశాలను పెంచుతుంది. ముఖ్యంగా పారితోషికాన్ని రెట్టింపు చేస్తుంది. ఎవరు కాదన్నా అవునన్నా ఇది నిజం. ఇక నటి కీర్తి సురేష్ కూడా ఇందుకు అతీతం కాదు. ఇదు ఎన్న మైకం చిత్రంతో కోలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ సీనియర్ నటి మేనక సురేష్ వారసురాలన్న విషయం తెలిసిందే. మాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు చేసిన కీర్తిసురేష్‌పై పొరుగు రాష్ట్రాల చిత్ర దర్శక నిర్మాతల దృష్టి పడింది. ఫలితంగా ఈ వర్ధమాన తారకు తమిళం, తెలుగు భాషలలో విజయం వరించింది.
తెలుగులో రామ్‌తో నటించిన నేను శైలజ చిత్రం కీర్తిసురేష్ విజయానికి పునాది వేసింది. తమిళంలో శివకార్తికేయన్‌తో నటించిన రజనీమురుగన్ చిత్రం దాన్ని కొనసాగించింది. దీంతో కీర్తి తన పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేశారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని కీర్తి కొట్టి పారేస్తున్నారు. తనేమంటున్నారో చూద్దాం. నేను నటించిన తెలుగు చిత్రం నేను శైలజ తమిళంలో శివకార్తికేయన్‌తో నటించిన రజనీమురుగన్ చిత్రం విజయం సాధించడం సంతోషంగా ఉంది. దీంతో పాటు నా బాధ్యత పెరిగింది. సాధారణంగా చిత్ర జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. అయితే కీర్తి వాళ్ల అమ్మ మేనక నటి అవడంతో తనకు మార్గదర్శిగా ఉండి కధల ఎంపికలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇక తమిళంలో బాబీసింహాతో నటిస్తున్న పాంబు సండై, ధనుష్ సరసన నటిస్తున్న చిత్రం ట్రైన్ షూటింగ్ పూర్తి అయ్యాయి. ప్రస్తుతం శివకార్తికేయన్ సరసనే మరో చిత్రం చేస్తున్నారు. అదే విధంగా నేను పారితోషికం పెంచేశాననే ప్రచారంలో నిజం లేదని కీర్తిసురేష్ స్పష్టం చేశారు.