బొమ్మరిల్లు హీరోకు కాస్త ఊరట కలిగినట్లే..!
అదే్ంటో హీరో సిద్దార్ధ ఒక స్టార్ రేంజ్ కు ఎదిగి.. ఆ తరువాత క్రమేపి కెరీర్ గ్రాఫ్ డౌన్ చేసుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి త్వరగా బయట పడక పోవడం.. టాలీవుడ్ ఆడియన్స్ సిద్దూను కేవలం లవర్ బాయ్ గా మాత్రమే చూడటానికి ఇష్టపడటం. వెరసి సిద్దార్దను ఇక్కడ నుంచి మూట ముల్లె సర్దుకునేలా చేశాయి. ఎప్పటి నుంచో తెలుగు లో ఒక మంచి హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ కావాలని తెగ కష్ట పడ్డాడు. […]
అదే్ంటో హీరో సిద్దార్ధ ఒక స్టార్ రేంజ్ కు ఎదిగి.. ఆ తరువాత క్రమేపి కెరీర్ గ్రాఫ్ డౌన్ చేసుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి త్వరగా బయట పడక పోవడం.. టాలీవుడ్ ఆడియన్స్ సిద్దూను కేవలం లవర్ బాయ్ గా మాత్రమే చూడటానికి ఇష్టపడటం. వెరసి సిద్దార్దను ఇక్కడ నుంచి మూట ముల్లె సర్దుకునేలా చేశాయి. ఎప్పటి నుంచో తెలుగు లో ఒక మంచి హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ కావాలని తెగ కష్ట పడ్డాడు. అయితే ఇంత వరకు మంచి హిట్ కొట్టలేక పోయాడు., కానీ… విడుదలైన కళావతి చిత్రం సిద్దార్ధ్ కు కొంత ఉపశమనం కలిగించందనే చెప్పాలి. తొసారిగా హర్రర్ జానర్ లో నటించిన సిద్దార్థ్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చాలా రోజులుగా సరైన హిట్ లేని సిద్దూకి ఈ సినిమా మంచి పేరు తీసుకువచ్చింది. త్రిష నటనతో పాటు గ్లామర్ షోతోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ బీచ్ సాంగ్ తో కమర్షియల్ కంటెంట్ ను యాడ్ చేసింది. చంద్రకళ సినిమాలో కనిపించిన తరహా పాత్రలో హన్సిక మరోసారి మెప్పించింది. ముఖ్యంగా చెల్లెలుగా, తరువాత దెయ్యంగా కూడా అద్భుతంగా నటించింది. కోవై సరళ, సూరిల కామెడీ టైమింగ్ బాగుంది.మొత్తం మీద కళావతి రూపంలో సిద్దూకు టాలీవుడ్ లో చాల కాలం తరువాత చెప్పుకో తగ్గ చిత్రం పడింది మరి.