మొదలైన సర్దార్ రికార్డుల పర్వం

విడుదలకు ముందే రికార్డులు సృష్టించడం పవన్ కు కొత్తేంకాదు. ప్రీ-బిజినెస్ లో పవర్ స్టార్ ది ఎప్పుడూ అప్పర్ హ్యాండే. అతడి సినిమాను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడతారు. కాబట్టి పవన్ సినిమాకు నిధుల కొరత ఉండదు. టేబుల్ ప్రాఫిట్ తో సినిమా స్టార్ట్ చేసే అరుదైన అవకాశం నిర్మాతకు లబిస్తుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కళ్లుచెదిరే బిజినెస్ చేస్తోంది. ఇన్నాళ్లూ సినిమా లేటవుతుందని బాధపడుతున్న నిర్మాత శరత్ మరార్… ఇప్పుడు […]

Advertisement
Update:2016-01-30 04:55 IST
విడుదలకు ముందే రికార్డులు సృష్టించడం పవన్ కు కొత్తేంకాదు. ప్రీ-బిజినెస్ లో పవర్ స్టార్ ది ఎప్పుడూ అప్పర్ హ్యాండే. అతడి సినిమాను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడతారు. కాబట్టి పవన్ సినిమాకు నిధుల కొరత ఉండదు. టేబుల్ ప్రాఫిట్ తో సినిమా స్టార్ట్ చేసే అరుదైన అవకాశం నిర్మాతకు లబిస్తుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కళ్లుచెదిరే బిజినెస్ చేస్తోంది. ఇన్నాళ్లూ సినిమా లేటవుతుందని బాధపడుతున్న నిర్మాత శరత్ మరార్… ఇప్పుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఈ మధ్యే ఫ్యాన్సీ రేటుకు ఓవర్సీస్ రైట్స్ అమ్మేశారు. తాజాగా విశాఖ ఏరియా హక్కుల్ని కూడా దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలకు అమ్మేశారని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ఇంత మొత్తానికి ఓ సినిమా అమ్ముడుపోవడం రికార్డుగా చెప్పుకుంటున్నారు. మరోవైపు శాటిలైట్ రైట్స్ కు సంబంధించి కూడా చర్చలు సాగుతున్నాయి. ఇలా ప్రతి బిజినెస్ ఎలిమెంట్ ను దగ్గరుండి పవనే పర్యవేక్షిస్తూ…. శరత్ మరార్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాడట. అదీ లెక్క.
Tags:    
Advertisement

Similar News