సూర్య సినిమాను అప్పుడే అమ్మేశారు...
రిలీజ్ కు ముందే సూర్య సినిమా రికార్డులు సృష్టిస్తోంది. తమిళ్ లో రికార్డులు సృష్టించడం గొప్ప కాదు. టాలీవుడ్ లో కూడా సూర్య సినిమా సంచలనం అయి కూర్చుంది. అవును…. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య చేసిన 24 అనే సినిమా రికార్డు రేటుకు అమ్ముడుపోయింది. ఈ సినిమా తెలుగు ప్రసార హక్కుల్ని…. ఏషియన్ మూవీస్ సంస్థ 16 కోట్ల రూపాయల భారీ మొత్తానికి దక్కించుకుందని సమాచారం. సూర్య-సమంత నటించిన ఈ సినిమా ఫస్టు లుక్కుతోనే తెగ […]
Advertisement
రిలీజ్ కు ముందే సూర్య సినిమా రికార్డులు సృష్టిస్తోంది. తమిళ్ లో రికార్డులు సృష్టించడం గొప్ప కాదు. టాలీవుడ్ లో కూడా సూర్య సినిమా సంచలనం అయి కూర్చుంది. అవును…. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య చేసిన 24 అనే సినిమా రికార్డు రేటుకు అమ్ముడుపోయింది. ఈ సినిమా తెలుగు ప్రసార హక్కుల్ని…. ఏషియన్ మూవీస్ సంస్థ 16 కోట్ల రూపాయల భారీ మొత్తానికి దక్కించుకుందని సమాచారం. సూర్య-సమంత నటించిన ఈ సినిమా ఫస్టు లుక్కుతోనే తెగ హంగామా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన స్టిల్స్…. అందర్నీ భలే ఎట్రాక్ట్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో సూర్య… ఎలాంటి డూప్ లేకుండా నటించాడనే వార్త ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సినిమాపై ఇంత హైప్ ఉంది కాబట్టే…. ఏకంగా 16 కోట్లకు తెలుగు వెర్షన్ అమ్ముడుపోయింది. సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదలకానుంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం మరో స్పెషల్ ఎట్రాక్షన్.
Advertisement