గతాన్నితలుచుకుని సిగ్గుపడుతున్న బాలయ్య
బాలకృష్ణ. అందరి నటుల కన్నా కాస్త వైవిధ్యం. ఆసాధారణ నటన ఆయన సొంతం. పంచ్ డైలాగులకు పర్యాయపదం. కానీ అలాంటి బాలయ్య ఇప్పుడు గతాన్ని తలుచుకుని సిగ్గుపడుతున్నారు . ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. పల్నాటి బ్రహ్మనాయుడు లాంటి సినిమాల్లో అసహజ నటనను గుర్తు చేసుకుని పశ్చాత్తపడ్డారు. ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య… తొగడొడితే రైలు ఆగిపోవడం ఏమిటి?… బస్సులు వెనక్కు వెళ్లడం ఏమిటి?. తలుచుకుంటే తనకే సిగ్గేస్తోందన్నారు. అసలు అలా చేయడానికి […]
బాలకృష్ణ. అందరి నటుల కన్నా కాస్త వైవిధ్యం. ఆసాధారణ నటన ఆయన సొంతం. పంచ్ డైలాగులకు పర్యాయపదం. కానీ అలాంటి బాలయ్య ఇప్పుడు గతాన్ని తలుచుకుని సిగ్గుపడుతున్నారు . ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. పల్నాటి బ్రహ్మనాయుడు లాంటి సినిమాల్లో అసహజ నటనను గుర్తు చేసుకుని పశ్చాత్తపడ్డారు. ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య… తొగడొడితే రైలు ఆగిపోవడం ఏమిటి?… బస్సులు వెనక్కు వెళ్లడం ఏమిటి?. తలుచుకుంటే తనకే సిగ్గేస్తోందన్నారు. అసలు అలా చేయడానికి ఎలా ఒప్పుకున్నానో అర్థం కావడం లేదన్నారు. అలాంటి సీన్లు చేసే అవకాశం డైరెక్టర్‌కు ఎందుకిచ్చానో అని బాధపడ్డారు. షూటింగ్ సమయంలోనే ఆ సీన్లు అతిగా అనిపించాయని… అయితే పాత్రలో ఇమిడిపోవడం వల్ల అభ్యంతరం చెప్పలేకపోయానని బాలకృష్ణ నవ్వుతూ చెప్పారు.
మరోవిషయం ఏమిటంటే పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో తాను చేసిన ఓవర్ యాక్షన్‌పై సోషల్ మీడియాలో సెటైర్లను కూడా బాలకృష్ణ చూశారట. సినిమాల్లో రానురాను అసహజ సన్నివేశాలు పెట్టడం తగ్గిపోతోందని… వాస్తవానికి దగ్గరగానే నేటి సినిమాల్లో సన్నివేశాలు ఉంటున్నాయని ట్రెండ్‌ను ఎనలైజ్ చేశారు బాలయ్య. అంటే రానురాను బాలయ్య సినిమాల్లో కూడా తొడలుకొట్టి ట్రైన్ ఆపడం, కంటి చూపుతో బస్సులను వెనక్కు పంపడం వంటి అతి సన్నివేశాలు ఉండబోవన్న మాట. watch video…