సోగ్గాడే సినిమా లచ్చిందేవికి కలిసొచ్చింది...
సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సూపర్ హిట్ అయింది. మరి ఈ సినిమా ఎవరికి కలిసొచ్చింది. హీరోకా… హీరోయిన్ కా…లేక దర్శకుడికా..? ఇది ఎవరికి కలిసొచ్చినా రాకపోయినా…. సోగ్గాడితో సంబంధం లేని మరో సినిమాకు మాత్రం బ్రహ్మాండంగా కలిసొచ్చింది. ఆ సినిమానే లచ్చిందేవికి ఓ లెక్కుంది. షార్ట్ కట్ లో … LOL. అవును… సోగ్గాడే హిట్ తో ఈ సినిమా జాక్ పాట్ కొట్టింది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో హీరోయిన్ గా నటించిన లావణ్య […]
Advertisement
సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సూపర్ హిట్ అయింది. మరి ఈ సినిమా ఎవరికి కలిసొచ్చింది. హీరోకా… హీరోయిన్ కా…లేక దర్శకుడికా..? ఇది ఎవరికి కలిసొచ్చినా రాకపోయినా…. సోగ్గాడితో సంబంధం లేని మరో సినిమాకు మాత్రం బ్రహ్మాండంగా కలిసొచ్చింది. ఆ సినిమానే లచ్చిందేవికి ఓ లెక్కుంది. షార్ట్ కట్ లో … LOL. అవును… సోగ్గాడే హిట్ తో ఈ సినిమా జాక్ పాట్ కొట్టింది.
సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠి…. లచ్చిందేవికి ఓ లెక్కుంది సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. పైగా తన పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉండే సినిమా అది. లచ్చిందేవి సినిమా మొత్తం లావణ్య చుట్టూనే తిరుగుతుంది. అలాంటి మూవీకి విడుదలకు ముందే హైప్ రావడానికి కారణం సోగ్గాడే చిన్ని నాయనా. లావణ్య నటించిన ఈ సినిమా హిట్టవ్వడంతో…. లచ్చిందేవి సినిమాను భారీ రేటుకు కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారట. మొత్తానికి నాగార్జున చలవతో… ఈ చిన్న సినిమాకు ఊహించని క్రేజ్ వచ్చేసింది. ఇది కూడా హిట్టయితే… తన కెరీర్ లో లావణ్య త్రిపాఠి హ్యాట్రిక్ కొట్టినట్టే. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే సినిమాలతో లావణ్య ఖాతాలో ఇప్పటికే రెండు హిట్స్ ఉన్నాయి మరి. జనవరి 29న లచ్చిందేవికి ఓ లెక్కుంది సినిమా విడుదలకానుంది.
Advertisement